Manchu Manoj Mounika Wedding.. సినీ నటుడు మంచు మనోజ్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. కాకపోతే, ఇలా పెళ్ళి పీటలెక్కడం ఆయనకు రెండో సారి.
ఇందులో వింతేముంది.? సినీ సెలబ్రిటీలే కాదు, రాజకీయ నాయకులు.. సాధారణ పౌర సమాజంలో కూడా ఇలాంటివి మామూలే అయిపోయాయి.!
తనకు కాబోయే భార్యని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు మనోజ్.
Manchu Manoj Mounika Wedding.. భూమా కుమార్తె మౌనిక..
మౌనిక ఎవరో కాదు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం గురించి తెలియనిదెవరికి.? తెలుగునాట రాజకీయాల్లో భూమా కుటుంబం తనదైన ముద్ర వేసింది.
భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్ళి జరగనుంది..
ఇందులో వింతేముంది.? ఇందులో తప్పేముంది.?
అసలు ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది.?
ఓ వైపు శుభాకాంక్షల వెల్లువ.. ఇంకో వైపు జుగుప్సాకరమైన కామెంట్ల హోరు..
ఎందుకిలా.?
Mudra369
భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె మౌనికా రెడ్డి (Mounika Bhuma). గతంలో ఆమెకు పెళ్ళి కాగా, ఆ వివాహ బంధం వర్కవుట్ అవలేదు.
మంచు మనోజ్‌కి (Manchu Manoj) సైతం గతంలో పెళ్ళయ్యింది. ఆయనకీ మొదటి పెళ్ళి వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో, ఈ ఇద్దరి మీదా కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా మనోజ్ – మౌనికల ప్రేమ వ్యవహారంపై వెబ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో గాసిప్స్ వినిపిస్తూ వచ్చాయి. అవిప్పుడు నిజమవుతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్‌తో శ్రీలీల ఆన్ స్క్రీన్ రొమాన్స్.!
బూమా కుటుంబంతో మంచు కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya)టీడీపీ నేతగా వున్నారు. మరోపక్క, మంచు కుటుంబం వైసీపీలో వుంది.
అన్నట్టు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (Ysr Congress Party Chief Ys Jagan Mohan Reddy), మంచు కుటుంబానికి బంధుత్వం కూడా వుందన్న సంగతి తెలిసిందే.