Table of Contents
Manyam Monagadu Pawan Kalyan.. సినిమా వేరు, రాజకీయం వేరు.! సినీ నటుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయ్యాక.. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టారు.
తనను అభిమానించే సినీ అభిమానుల్ని, సినిమాల విషయమై బుజ్జగించారు. ఫ్యాన్ వార్స్ విషయమై హెచ్చరించారు.
ఏదన్నా సమస్యపై స్పందించాల్సి వస్తే, ఆచి తూచి వ్యవహరించడంలో పవన్ కళ్యాణ్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.
‘నన్ను 2019లో మీరు ఓడించలేదు.. మీరు నన్ను పరీక్షించారు.. ఆ పరీక్షలో నెగ్గి, ఈ రోజు మీ ముందర నిల్చున్నాను. నన్ను గెలిపించింది కూడా మీరే..’ అని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
Manyam Monagadu Pawan Kalyan.. భయం లేదు.. బాధ్యత మాత్రమే.!
మన్యం ప్రాంతంలో పర్యటించాలంటేనే ప్రజా ప్రతినిథులకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. కానీ, పవన్ కళ్యాణ్ బెదరలేదు. గిరిజనులెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా, కొండల్లో తిరిగారు. మట్టిలో నడిచారు.
ఇలా పవన్ కళ్యాణ్ తమ వద్దకు రావడంతో మన్యం ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఇచ్చిన మాటని, డిప్యూటీ సీఎం అవుతూనే గుర్తుపెట్టుకుని, గిరిజనుల వద్దకు వెళ్ళి, ఇదిగో నాకు మీరు అధికారం ఇచ్చినందుకు, మీకు నేను చేస్తున్న సేవ.. అని ‘చేతల్లో’ చేసి చూపించారు పవన్ కళ్యాణ్.
డోలీ.. కలచివేసింది..
గిరిజనులు – డోలీ.. ఇది అందరికీ తెలిసిన విషాద గాధ. సరైన రోడ్డు మార్గం లేక, ఆపత్కాలంలో డోలీల్లో రోగుల్ని తరలించడం, సకాలంలో వైద్యం అందక, గిరిజనులు మృతి చెందడం.. ఇది పవన్ కళ్యాణ్‌ని కలచివేసింది.

డిప్యూటీ సీఎం హోదాలో, గిరిజన ప్రాంతాల్లో రోడ్లని ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. డోలీల ప్రస్తావనే ఇకపై వుండకూడదని అధికారుల్ని ఆదేశించారు.
గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో గంజాయి సాగుకి గిరిజనులు దూరంగా వుండాలనీ పవన్ కళ్యాణ్ సూచించారు.
గంజాయి.. పెను సాహసం..
నిజానికి, గంజాయి సాగు చెయ్యొద్దని గిరిజనులతో చెప్పడమంటే సాహసమే. అక్కడి సామాజిక పరిస్థితులు అలా వుంటాయి.
కానీ, ఆ గంజాయి ఓ సామాజిక సమస్యగా మారిందని పవన్ కళ్యాణ్ గిరిజనులకు అవగాహన కల్పించిన తీరు ఓ అద్భుతం అంతే.
Also Read: పుష్ప 2 ది రూల్ రివ్యూ: వైల్డ్ ఫైర్ కాదు, వరస్ట్ ఫైర్.!
గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి, అక్కడి ప్రజల మనసుల్ని గెలవడం మామూలు విషయం కాదు. ఓ ప్రజా ప్రతినిథికి అది మరింత కష్టమైన పని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం, తాను అందరిలోకీ ప్రత్యేకం అని నిరూపించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన్యంలో మొనగాడిగా మారారు. చేసే పని పట్ల అంకిత భావం, ప్రజా సంక్షేమం విషయంలో చిత్తశుద్ధి.. ఇవన్నీ పవన్ కళ్యాణ్‌ని నిఖార్సయిన నాయకుడిగా నిలబెట్టాయి.