Home » ‘మీ..టూ..’ 10 కోట్లు.. 50కోట్లు.!

‘మీ..టూ..’ 10 కోట్లు.. 50కోట్లు.!

by hellomudra
0 comments
Tanushree Dutta Rakhi Sawant Me Too

మీ..టూ.. (Me Too) ఉద్యమంపై ఉక్కు పాదం మోపడానికి ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ (Rakhi Sawant) రంగంలోకి దిగినట్టుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్‌ (Nana Patekar) పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా ‘మీ..టూ..’ (Me Too India) ఉద్యమానికి తనూశ్రీ దత్తా (Tanushree Dutta) ఆజ్యం పోస్తే, ఆ వివాదాన్ని చల్లార్చేందుకుగాను తనూశ్రీ దత్తాపై రాఖీ సావంత్‌ (Me Too Tanushree Dutta Rakhi Sawant) వెటకారాలు చేయడం అంతటా చర్చనీయాంశమవుతోంది.

రాఖీ సావంత్‌ అంటేనే వివాదాల పుట్ట. ‘రాఖీ కా స్వయంవర్‌’ (Rakhi ka swayamvar) అనే రియాల్టీ షో పేరుతో ఆమె చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అంతకు ముందు ప్రియుడితో ముద్దు వివాదాన్నీ ఆమె క్యాష్‌ చేసుకుంది. చేసిన సినిమాలకంటే, వివాదాలతోనే రాఖీ సావంత్‌ ఎక్కువ పాపులారిటీ పెంచుకుంది.

తనూశ్రీ ఛాన్స్‌ని దక్కించుకున్న రాఖీ సావంత్‌

‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ (Horn Ok Please) అనే సినిమా కోసం తనూశ్రీ దత్తా ఓ ఐటమ్‌ సాంగ్‌ (Item Song) చేయాల్సి వుంది. సెట్స్‌లో నానా పటేకర్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ సాంగ్‌ నుంచి తప్పుకుంది తనూశ్రీ దత్తా. దర్శకుడికి ఫిర్యాదు చేసినా, నిర్మాతకు చెప్పినా నానా పటేకర్‌ వేధింపులు, వెకిలి వేషాలు తగ్గకపోవడంతో చేసేది లేక తనూశ్రీ దత్తా ఆ ఛాన్స్‌ వదులుకుంది. తనూశ్రీ దత్తా వదులుకున్న ఆ పాటని పూర్తి చేసింది రాఖీ సావంత్‌. ఎంతైనా ఐటమ్‌ బాంబ్‌ (Item Bomb) కదా, ఏ మాత్రం మొహమాటపడకుండా ఆ సాంగ్‌ని హాట్‌ హాట్‌గా చేసేసింది ఈ సెక్సీ భామ.

రాఖీ సావంత్‌పై తనూశ్రీ పరువు నష్టం దావా

‘పదేళ్ళ క్రితం నాటి ఘటనను ఇప్పుడు ప్రస్తావిస్తోంది తనూశ్రీ దత్తా. బహుశా పదేళ్ళు కోమాలోకి వెళ్ళిపోయిందేమో..’ అంటూ తనూ శ్రీదత్తా, నానా పటేకర్‌పై చేసిన ‘మీ..టూ..’ (MeToo) ఆరోపణలపై రాఖీ సావంత్‌ వెటకారం చేయడంతో, తనూశ్రీ దత్తా కూడా ఘాటుగా స్పందించింది. ఆమె తరఫు న్యాయవాది, రాఖీ సావంత్‌కి నోటీసులు పంపారు. నోటీసులకు స్పందించాలనీ, లేదంటే 10 కోట్ల పరువు నష్టం దావా తప్పదని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాఖీ సావంత్‌పై తనూశ్రీ దత్తా నోరు పారేసుకుందనే వాదన రాఖీ సావంత్‌ తరఫున విన్పిస్తోంది.

లో క్లాస్‌ రాఖీ సావంత్‌

‘లో క్లాస్‌ (Low Class) రాఖీ సావంత్‌ అంటావా.? నేను లో క్లాస్‌ కాదు, లోవర్‌ (Lower Class) క్లాస్‌ కాదు. నీ సంగతి తేల్చుతా. నీ మీద 50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’ అంటూ రాఖీ సావంత్‌ ఊగిపోయింది. ఈ మేరకు ఓ వీడియోని సోషల్‌ మీడియాలో రాఖీ సావంత్‌ పోస్ట్‌ చేసింది. అందులో తనూశ్రీ దత్తాపై రాఖీ సావంత్‌ వేసిన సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, రాఖీ సావంత్‌ ఆరోపణలపై ఇప్పుడు తనూశ్రీ దత్తా స్పందించాల్సి వుంది. ఆమె ఎలా స్పందిస్తుందోనని బాలీవుడ్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

‘మీ.. టూ..’ ఉద్యమాన్ని చంపేసేందుకేనా?

‘మీ..టూ..’ (MeToo India) ఉద్యమానికి వ్యతిరేకంగా తాను మాట్లాడటంలేదనీ, పని చేసే చోట లైంగిక వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేననీ, ఇందులో మహిళలతోపాటు, పురుషులూ బాధితులుగా వున్నారనీ, బాధితుల పట్ల తనకు పూర్తి చిత్తశుద్ధి వుందనీ, వారికి సంఘీభావం తెలుపుతూనే, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమంలో తాను పాల్గొంటాననీ రాఖీ సావంత్‌ అంటోంది. అయితే, ‘మీ..టూ..’ ఉద్యమానికి వ్యతిరేకంగా తనూశ్రీ దత్తాతో పోరాటమేంటని ప్రశ్నిస్తే మాత్రం, అది వేరే అంశమని అంటోంది ఈ ఐటమ్‌ బాంబ్‌.

ఏది ఏమైనా, రాఖీ సావంత్‌ – తనూశ్రీ దత్తా వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావాలు వేస్తామనే ప్రకటనలు, ఆ దిశగా అడుగులు ‘మీ..టూ..’ (MeTooIndia) ఉద్యమానికి మాత్రం విఘాతం కలిగించేలా వున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group