మీరా చోప్రా.. అనగానే, తెలుగులో ’బంగారం‘ సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన విషయం విదితమే. అయితే, ‘బంగారం’ (Meera Chopra About South Cinema) సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసిందనుకోండి. అది వేరే సంగతి. నితిన్ సరసన కూడా మీరా చోప్రా ఓ సినిమా చేసింది. మరికొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.
తమిళంలోనూ మీరా చోప్రా (Meera Chopra) పలు సినిమాల్లో నటించినా, సౌత్ సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయింది. కారణమేంటో తెలుసా.? ఇంకేంటి, అహంకారం. ఈ విషయాన్ని స్వయంగా మీరా చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకుంది.

‘అన్నిట్లోనూ నేనే బెస్ట్.. అని అనుకునేదాన్ని. అదే నా కొంప ముంచింది. చాలా మంచి అవకాశాల్ని వదులుకున్నాను. ఏ నిర్మాత, దర్శకుడు, హీరో నన్ను రిపీట్ చేయాలనుకోలేదు వారి తదుపరి సినిమాల్లో. అందుకు నా ప్రవర్తనే కారణం. కానీ, తప్పు తెలుసుకునేటప్పటికే నష్టం జరిగిపోయింది కెరీర్ పరంగా’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరా చోప్రా (Meera Chopra Hot) చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అడపా దడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోన్న మీరా చోప్రా, ‘చోప్రా’ (Meera Chopra Spicy) అనే ట్యాగ్ తనకు సినీ పరిశ్రమలో పెద్దగా ఉపయోగపడలేదనీ, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కజిన్.. అన్న గుర్తింపుతో తానేమీ ఎవర్నీ కాకా పట్టలేదనీ ఓ ప్రశ్నకు బదులిచ్చింది.
‘గతంలోలా కాదు. నేను చాలా మారిపోయాను. నటిగా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. దక్షిణాది సినిమాల్లోనూ నటించాలని వుంది. అవకాశాలు వస్తాయనే ఆశిస్తున్నా..’ అని మీరా చోప్రా (Meera Chopra About South Cinema) సౌత్ సినీ పరిశ్రమకు (South Cinema Industry) ఇంకోసారి తనైన స్టయిల్లో గాలం వేసేస్తోంది.