Meera Chopra Thamma Rashmika.. మీరా చోప్రా గుర్తుందా.? తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బంగారం’ సినిమాలో నటించింది. నితిన్‌తోనూ ఓ సినిమా చేసింది మీరా చోప్రా.!
అప్పట్లో, నితిన్ సినిమా నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టింది మీరా చోప్రా. ఆ కారణంగానే, సినిమా విడుదలకు నానా తంటాలూ పడాల్సి వచ్చింది.
తెలుగుతోపాటు, తమిళంలోనూ మీరా చోప్రా కొన్ని సినిమాలు చేసింది. తమిళం నుంచే, తెలుగులోకి వచ్చింది మీరా చోప్రా.!
అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్న మీరా చోప్రా, సోషల్ మీడియా వేదికగా సినిమాలు, రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ, వార్తల్లో వ్యక్తిగా మారుతోంది.
Meera Chopra Thamma Rashmika.. ‘థామా’పై పగబట్టేసిన మీరా చోప్రా..
తాజాగా, రష్మిక మండన్న కొత్త సినిమా ‘థామా’పై సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీరా చోప్రా.
ముంబై బాంద్రా ప్రాంతంలో మీరా చోప్రా. ఓ థియేటర్‌లో ‘థామా’ సినిమా చూసిందట. అయితే, థియేటర్ మొత్తం ఖాళీగానే వుందని మీరా చోప్రా ట్వీటేసింది.

థియేటర్లో ఎవరూ లేరు.. కానీ, సినిమాకి 25 కోట్లు వచ్చేశాయని ‘థామా’ టీమ్ తప్పుడు లెక్కలు చెబుతోందన్నది మీరా చోప్రా ఆరోపణ.
‘అసలంటూ, జనం ఎవరూ లేని థియేటర్లో సినిమా చూడ్డానికి ఎందుకు వెళ్ళావ్ బంగారమ్.?’ అంటూ నెటిజన్లు కామెంట్లేస్తున్నారు మీరా చోప్రా పైన.
దీపావళి తర్వాతి రోజు, థియేటర్లలోకి వచ్చింది ‘థామా’.! సినిమాకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అందులో, ఎక్కువగా నెగెటివ్ రివ్యూలే వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: బుర్రలు బద్దలాసుపోయే ప్రశ్న: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత.?
సినిమా ఎలా వున్నా, ఎక్కువ వసూళ్ళ లెక్కలు చెప్పుకోవడం అనేది ఓ పబ్లిసిటీ స్టంట్. సినీ రంగానికి చెందిన మీరా చోప్రాకి ఆ మాత్రం తెలియదా.?
పైగా, సినీ పరిశ్రమలో వుంటూ.. సినిమాల మీద నెగెటివ్ కామెంట్లు చేయడమేంటని మీరా చోప్రాని రష్మిక అభిమానులు ప్రశ్నిస్తున్నారు.!
