Mega 157 Concept Chiranjeevi.. ఆకాశం.. నీరు.. నిప్పు.. నేలా ఈ గాలీ.! తెలుసు కదా.! ఇది పవన్ కళ్యాణ్ సినిమా ‘అన్నవరం’ సినిమాలోని ఓ పాట.!
పంచభూతాల్ని ప్రస్తావిస్తూ, మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మెగా 157’ కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు.
నక్షత్రం.. ఆ మధ్యలో త్రిశూలం.! ఓ పెద్ద వృక్షం.. ఓ నల్ల తేలు.! ఇదీ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌లోని ముఖ్యమైన విషయాలు.
మెగా.. ‘స్టార్’.!
ప్రధానంగా కనిపిస్తోన్న నక్షత్రం.. అదే స్టార్.! మెగాస్టార్ చిరంజీవిని (Mega Star Chiranjeevi) ప్రతిబింబిస్తోందని అనుకోవచ్చు.
త్రిషశూలమంటే, శంకరుడి చేతిలో వుంటుంది.! మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్.!
ఇక్కడ, తేలు ప్రస్తావన ఎందుకు.? కాన్సెప్ట్ పోస్టర్ కంటే ముందు రివీల్ చేసిన, ప్రీ-అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రధానంగా తేలునే చూపించారు.
Also Read: సచ్చిపోతే.. సూపించొద్దు.! పోసాని రూటే సెపరేటు.!
‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో ఈ ‘మెగా157’ సినిమా తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించనున్నారు.
సినిమాటోగ్రఫీ చోటా కె నాయుడు మాత్రమే ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి ఖరారైన టెక్నీషియన్.
నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘యముడికి మొగుడు’, ‘అంజిత’ తదితర సినిమాల తర్వాత, ఆ తరహాలో చిరంజీవి చేస్తోన్న సినిమా ఈ ‘మెగా 157’.!