మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తనయుడతడు.. అందుకే, ‘తండ్రిని మించిన తనయుడు’ అనిపించుకోవడానికి అనునిత్యం కష్టపడుతుంటాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan Tollywood Magadheerudu) నుంచి ‘మగధీర’ సినిమా వచ్చింది.
‘నేనెప్పుడూ ఇలాంటి సినిమా చేయలేదు.. నా కొడుకు చేసి చూపించాడు. నాకే సవాల్ విసిరాడు.. ఖచ్చితంగా నేనూ అలాంటి సినిమా చేస్తాను..’ అని చిరంజీవి (Konidela Chiranjeevi) ఓ సందర్భంలో ‘మగధీర’ గురించి చెబితే, తండ్రి కోరికను నెరవేర్చడానికి నిర్మాతగా మారాడు. ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సినిమా చేశాడు.
సినిమాలే వద్దనుకున్న చిరంజీవిని మళ్ళీ సినిమాల్లోకి లాక్కొచ్చింది రామ్ చరణ్. ‘కేరింగ్ సన్..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడ్ని చూసి మురిసిపోతోంటే, ఎవరికైనా చూడముచ్చటనిపిస్తుంది. ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తాడని విమర్శించేవారికి ‘రంగస్థలం’ సినిమా చేసి చూపించాడు.. తన సత్తా చాటి చెప్పాడు.
ఓ వైపు తను హీరోగా సినిమాలు చేస్తూ, ఇంకోపక్క తన తండ్రిని హీరోగా పెట్టి తాను నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తూ.. రెండు పడవల ప్రయాణాన్ని అత్యంత సాఫీగానే కాదు, అత్యంత సమర్థవంతంగా కొనసాగిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

త్వరలో.. అతి త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు అల్లూరి సీతారామరాజు (Alluri Sita Ramaraju) రాబోతున్నాడు మెగా పవర్ స్టార్.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినీ పరిశ్రమలోనే అతి పెద్ద మల్టీ స్టారర్.
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ సినిమాలో కొమరం భీం (Komaram Bheem NTR) పాత్రలో కనిస్తోంటే, అల్లూరి సీతారామరాజులా (Seetha Rama Raju Charan) రామ్ చరణ్ (Mega Power Star Ram Charan Tollywood Magadheerudu) నటిస్తున్న సంగతి తెలిసిందే.