Mega Star Chiranjeevi Abhimaanulu.. మెగాస్టార్ చిరంజీవికి వందల్లోనో.. వేలల్లోనో కాదు.. లక్షల్లో.. కోట్లలో అభిమానులుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.!
అభిమానులందు దురభిమానులు వేరయా.! అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచీ ‘కొందరు దురభిమానుల కారణంగానే’ వెన్నుపోటుకి గురవుతున్నారు.
సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని కథానాయకుడు.! సేవా రంగంలోనూ ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
రక్తదానం.. నేత్రదానం.. ఆపై ఆక్సిజన్ బ్యాంక్స్ కూడా.!
బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్.. వీటి ద్వారా ఎన్నో ప్రాణాల్ని మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నిలబెడుతున్నారు.. ఎందరికో చూపుని ప్రసాదిస్తున్నారు.
కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని కూడా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నెలకొల్పిన సంగతి తెలిసిందే.

మరి, రాజకీయాల్లో ఎందుకు చిరంజీవి, రాణించలేకపోయారు.? 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి తనదైన ప్రత్యేకతను చాటుకున్నమాట వాస్తవం.
తిరుపతి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
Mega Star Chiranjeevi Abhimaanulu.. అందరివాడే.. కానీ, కొందరికి గిట్టనివాడు.!
రాజకీయాల్లోకి రాకముందు ఆయన ‘అందరివాడు’.! రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం ఆయన్ని ‘కొందరివాడు’గా మార్చేశారు.. సోకాల్డ్ దురభిమానులు.
‘నేనూ చిరంజీవి అభిమానినే..’ అని చెప్పుకుని, చిరంజీవి పంచన చేరిన చాలామంది దురభిమానులు పొడిచిన వెన్నుపోటుతో, రాజకీయాలపై విరక్తి పెంచుకున్నారాయన.
Also Read: రేణు దేశాయ్ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పెంత.?
రాజకీయాలు వదిలేసి, కేవలం సినిమాలకే పరిమితమైనాగానీ, చిరంజీవిని (Mega Star Chiranjeevi) ఈ ‘దురభిమానుల వెన్నుపోటు’ వీడటంలేదు.
కీలక పదవుల్లో వున్న వ్యక్తులు కూడా, ‘నేనూ చిరంజీవి అభిమానినేగానీ..’ అంటూ ఆయన్ని బూతులు తిడుతున్న వైనాన్ని చూస్తున్నాం.

అసలంటూ చిరంజీవిని అభిమానించేవారెవరైనా, ఆయన్ని విమర్శించగలరా.? తూలనాడగలరా.? కనీసం, ఉచిత సలహాలు.. బోడి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారా.?
జై చిరంజీవ.. అనేటోడే చిరంజీవి తప్ప, ‘నేనూ చిరంజీవికి అభిమానినే’ అని చెప్పుకుని, చిరంజీవినో.. చిరంజీవి తమ్ముడినో విమర్శించేవాడు, చిరంజీవి కుటుంబంపై అవాకులు చెవాకులు పేలేవాడు.. చిరంజీవికి అభిమాని ఎలా అవుతాడు.?
చిరంజీవిని తిట్టి.. అదే చిరంజీవి కాళ్ళుని ‘తప్పయిపోయింది క్షమించన్నా..’ అని వాపోయినవాళ్ళున్నారు.. కానీ, వాళ్ళే.. అది కేవలం ‘నటన’ అని ప్రూవ్ చేసుకున్న సందర్భాలూ లేకపోలేదు.
అంతే కాదు, చిరంజీవి ఇంట్లో తిని.. చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని.. ఆ చిరంజీవినే విమర్శించే భయంకరమైన ఉన్మాదులూ వున్నారు. ఇది కలికాలం.!