Mega Star Chiranjeevi.. బాస్ ఈజ్ బ్యాక్.. రొచ్చు రాజకీయం తనకెందుకు.? అన్న భావనతో ఎప్పుడో రాజకీయాల్నివదిలేశారు.. మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో ‘అందరివాడు’ చిరంజీవి. రాజకీయాల్లో మాత్రం అతన్ని‘కొందరివాడు’గా చిత్రీకరించింది గుంటనక్కల ముఠా.
మార్పు – ఎవరో తీసుకొస్తే జరిగేది కాదు. అది జనంలోంచి రావాలి. ఇప్పుడున్న రాజకీయాల్లో ఆ మార్పుని జనం కూడా కోరుకోవడం లేదు. ప్రజారాజ్యం పార్టీ, జనసేన ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న ఆటుపోట్లే అందుకు నిదర్శనం. జనానికి మేలు చేయాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయాల్లో లేని చిరంజీవిని ఇంకా బూచిగా చూపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న కులాల కుంపట్లను రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాయ్.
రాజకీయం.. ఇంత హేయమా.?
రొచ్చు రాజకీయం.. ఏ స్థాయికైనా దిగజారిపోతుందని చిరంజీవికి బాగా తెలుసు. అందుకే, రాజకీయాలపై ఆయన మళ్లీ ఆసక్తి పెంచుకోవడం లేదు. అయినా కానీ, చిరంజీవిని వదిలిపెట్టడం లేదు రాజకీయ గుంటనక్కలు. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడాల్లేవ్. నిస్సిగ్గుగా చిరంజీవి చుట్టూ, దుష్ర్పచారం చేసేస్తున్నాయ్ పొలిటికల్ గుంటనక్కలు.

చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమట.. అనే ప్రచారం కూడా ఆ గుంట నక్కల పనే. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదకగా ఆ గుంటనక్కల ప్రచారాన్ని తిప్పి కొట్టారు. చావు దెబ్బ కొట్టారు. రాజకీయాల్ని వదిలేసుకున్నాననీ, చట్ట సభలకు వెళ్లే అవకాశమే లేదనీ కుండ బద్దలు కొట్టేశారు.
Mega Star Chiranjeevi మెగా క్లారిటీ.!
చిరంజీవి (Chiranjeevi) నుంచి ఇలాంటి స్పష్టతని ఊహించని సో కాల్డ్ గుంట నక్కలు ఇప్పుడు కుయ్యో మొర్రో అంటున్నాయ్. చిరంజీవి పేరుని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయ భవిష్యత్తుని దెబ్బకొట్టాలని చూసే ఆ గోతి కాడి నక్కలకు మెగా దెబ్బ చాలా చాలా గట్టగానే తగిలింది.
Also Read: Mega Star Chiranjeevi.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.!
కానీ, తగిలిన దెబ్బ గురించి గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి. ‘కొట్టింది నిన్నే.. కావాలంటే అద్దంలో చూస్కో..’ అని ఒకడంటే, కాదు, నీ గూబే వాచింది చూస్కో.. అంటూ ఇంకొకడంటున్నాడు. కానీ, ఇద్దరికీ వాచిపోయింది. ఒకడి వాపు ఇంకొకడికి కనిపిస్తోంది. కానీ, ఎవడి వాపు వాడికి కనిపించడం లేదు. ‘మెగా’ దెబ్బ ఆ రేంజ్‌లో తగిలింది మరి.