Table of Contents
Megastar Chiranjeevi.. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. అంటాడో సినిమాలో హీరో. ఆ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! సారీ, తనను పవర్ స్టార్ అని పిలవొద్దని పవన్ కళ్యాణ్ చెబుతుంటారనుకోండి.. అది వేరే సంగతి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోనిది పై డైలాగ్.! ఈ డైలాగ్ మెగాస్టార్ చిరంజీవికి సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు.. అలాగే ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడు. అందుకే, ఆయన అందరివాడయ్యాడు.
ఆ ‘మంట’కి చికిత్స లేదు.!
దురదృష్టమేంటంటే, కొందరికి ఆయనంటే ఒళ్ళు మంట. ఆ ‘మంట’కి సరైన కారణమే వుండదు. అదంతే, అదో ‘రోగం’ అనుకోవాల్సిందేనేమో.. అంటారు చిరంజీవిని అభిమానించేటోళ్ళు.! లేకపోతే, చిరంజీవిని వ్యతిరేకించడానికి బలమైన కారణాలేమైనా వుంటాయా.? నాన్సెన్స్.!

ఓ ముఖ్యమంత్రి ముందరకు వెళ్ళి, చేతులు జోడించి అడుగుతున్నా.. అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, కొందరిని నొప్పించాయి. అది చిరంజీవి మీద వారికి వున్న అభిమానం మాత్రమే. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సినీ పరిశ్రమకు రారాజు.! అలాంటి చిరంజీవి, ఇలా దేబిరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందన్నదే చాలామంది ఆవేదన.
Megastar Chiranjeevi.. అసలు గుర్తింపు.. ‘అందరివాడు’గానే.!
తప్పదు, ‘వసుదేవుడంతటోడే..’ అన్న మాటని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో వుంది. పరిశ్రమ బిడ్డగా ఆ కష్టాన్ని జీర్ణించుకోలేక, సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు.
చిరంజీవి కష్టాన్ని ఎవరు గుర్తించాలో, వాళ్ళు గుర్తించారు. అందులో ఓ పాన్ ఇండియా స్టార్, ఓ సూపర్ స్టార్ వున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పెంచిన జక్కన్న కూడా వున్నాడు.
నెగ్గడమేంటి.? తగ్గడమేంటి.?
అయినా, కష్టాన్ని నమ్ముకుని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన చిరంజీవి.. తగ్గడమేంటి.? నెగ్గడమేంటి.? ఆయనెప్పటికీ అందరివాడే.! అందరి కోసం తన స్థాయిని అవసరమైతే తగ్గించుకోవడానికి కూడా చిరంజీవి వెనుకాడరు. దటీజ్ చిరంజీవి. ఆ విషయమే ఇంకోసారి నిరూపితమయ్యింది.
చిరంజీవి ‘పెద్దరికాన్ని’ గుర్తించేందుకు చాలామందికి ‘అహం’ అడ్డంకిగా మారుతోంది. కానీ, చిరంజీవి పెద్దరికాన్ని ఎవరూ గుర్తించాల్సిన అవసరంలేదు. పరిశ్రమ సమస్యల్లో వున్నప్పుడు, బాధ్యతగా ముందుకొచ్చిన చిరంజీవి కంటే పెద్దమనిషి ఎవరుంటారు.?
పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదంటాడో మే‘తా’వి.! ఫలానా వాడిదేనని ఎవడన్నా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది.? ఏ ఒక్కడ్ని అయితే తక్కువ చేసి చూపించాలని అనుకున్నారో, ఆ ఒక్కడే.. (Mega Star Chiranjeevi) పరిశ్రమకు నాయకత్వం వహించాడు.. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం.
హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి.!
Also Read: కొత్త రాజ్యాంగం రాస్కో బాసూ.! ఇంతకీ, ఏ సిరాతో.!
చివరగా, అసలు ఇంతలా ప్రభుత్వాల్ని సినీ పరిశ్రమ ‘అడుక్కోవాల్సిన’ పరిస్థితి ఎందుకొచ్చింది.? ఎందుకంటే, సినీ పరిశ్రమలో ఐక్యత లేకపోవడం వల్లనే.
తమ సమస్యల పరిష్కారం కోసం కూడా సినీ పరిశ్రమకు చెందినవారందరూ ఒక్కతాటిపైకి రాలేకపోవడం ఆశ్చర్యకరం. పోనీ, ఎవరన్నా ధైర్యంగా ముందుకొస్తే, నిస్సిగ్గుగా మోకాలడ్డేస్తున్నారు కొందరు. అదే, ఆ అనైక్యతే మొత్తంగా తెలుగు సినిమా కొంప ముంచేస్తోంది.!