Megastar Chiranjeevi Cancer Media.. మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సెటైరేశారు.! జస్ట్ సరదాకి.. కాదు సుమీ.! చాలా సీరియస్‌గానే సెటైరేశారు. కాకపోతే, సరదాగా వేసినట్టే వేశారు.! అదే ఆయన ప్రత్యేకత.
అసలు విషయమేంటంటే, కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, ఓ ఆసుపత్రికి సంబంధించిన క్యాన్సర్ సెంటర్‌ని ప్రారంభించారు.
ఆ సమయంలో, తనకు గతంలో కొలనోస్కోపీ చేశారనీ, చిన్నపాటి సర్జరీ జరిగిందనీ.. ఆ సర్జరీ జరగకపోయి వుంటే, క్యాన్సర్ వచ్చే అవకాశం వుండేదని వైద్యులు చెప్పినట్లు వివరించారు చిరంజీవి.
Megastar Chiranjeevi Cancer Media.. చిరంజీవికి క్యాన్సరొచ్చిందట..
ఇంకేముంది.? చిరంజీవికి ప్రాణాంతక క్యాన్సర్ సోకిందనీ.. వైద్యులు ఆయన ప్రాణాల్ని కాపాడరనీ.. మీడియా పిచ్చి రాతలు రాసేసింది.
ఈ వ్యవహారంపై అప్పట్లోనే చిరంజీవి స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్, సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు కూడా.!

ఇప్పుడు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించారు చిరంజీవి. సందర్భం అలాంటిది మరి. రోజుకి వెయ్యి మందికి చొప్పున క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు చిరంజీవి.
గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆయా స్క్రీనింగ్ పరీక్షల కోసం చిరంజీవి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
అభిమానులు, పేదలు, సినీ కార్మికుల కోసం ఈ కార్యక్రమాన్ని చిరంజీవి చేపడుతున్నారు.
మళ్ళీ నా గురించి అలా రాయరుగా..
ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘నా గురించి మీరు మళ్ళీ అలా రాయరుగా..’ అంటూ మీడియాకి చురకలంటించారు చిరంజీవి.
సినిమా రంగంలో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన చిరంజీవి (Mega Star Chiranjeevi), తాను సినిమాల ద్వారా సంపాదించి సొమ్ము నుంచి కొంత భాగాన్ని సమాజం కోసం వెచ్చిస్తున్నారు.
Also Read: హనుమంతుడు దేవుడే కాదు.! ఆదిపురుషుడే చెప్పాడు.!
పైగా, క్యాన్సర్ మహమ్మారి విషయంలో ముందస్తు పరీక్షల ఆవశ్యకతను గుర్తించి, స్క్రీనింగ్ పరీక్షల కోసం ముందుకొచ్చిన చిరంజీవికే క్యాన్సర్‌ని ఆపాదించేసింది మీడియా.
క్యాన్సర్ కంటే ప్రమాదకరంగా తయారై సమాజాన్ని పట్టి పీడిస్తున్న సోకాల్డ్ మీడియాకి, చిరంజీవి సెటైర్లు గట్టిగానే తగులుతాయ్.!
కానీ, సిగ్గా.? ఎగ్గా.? సిగ్గొదిలేస్తేనే మీడియా.. అన్నట్లు తయారైందిప్పుడు.!