Mehreen Pirzada OTT.. మెహ్రీన్.. ఈ పేరు చెప్పగానే, ముందుగా గుర్తుకొచ్చేది ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అనే.!
‘నేను చెప్పానా.. నేను చెప్పానా..’ అంటూ, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్ కౌర్ పిర్జాదా.!
తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది మెహ్రీన్. ‘ఎఫ్-2’ సినిమాలోని, ఆమె పాత్ర అయితే ఆమెకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
‘హనీ ఈజ్ ది బెస్ట్..’ అంటూ, ‘ఎఫ్-2’లో మెహ్రీన్ క్యూట్ క్యూట్‌గా చెప్పిన డైలాగులు బోల్డంత పాపులర్ అయ్యాయి.
Mehreen Pirzada OTT.. అలా మాయమైపోయి..
అసలు విషయానికొస్తే, మధ్యలో కొన్నాళ్ళు మెహ్రీన్, తెలుగు తెరపైనుంచి మాయమైపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే, పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మొన్నీమధ్యనే ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. అది తెలుగులోనూ అందుబాటులో వుందనుకోండి.. అది వేరే సంగతి.
ఈసారి నేరుగా, తెలుగులోనే ఓ వెబ్ సిరీస్ చేయబోతోందిట మెహ్రీన్ పిర్జాదా.! వెబ్ సిరీస్ అంటే, వల్గర్ సీన్స్ అన్నది ఒకప్పటి వాదన.
ఇప్పుడూ వల్గర్ సీన్స్ వుంటున్నాయిగానీ, సినిమాల్లో కంటే ఎక్కువేం కాదు.! అయినా, ‘ఛీ పాడు.. ఓటీటీ అంటే అదొక్కటేనా.?’ అనే భావనా పెరిగింది.
అన్నట్టు, హిందీ వెబ్ సిరీస్ ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’లో ‘చీ..పాడు’ సీన్స్‌లోనూ మెహ్రీన్ నటించేసింది లెండి.. అది వేరే వ్యవహారం.!
ఛీ పాడు.. సన్నివేశాల్ని పక్కన పెడితే, వెబ్ సిరీస్‌ల ద్వారా నటనకు ఎక్కువ ఆస్కారం లభిస్తోందని అంటోంది మెహ్రీన్ పిర్జాదా.!