Mehreen Pirzada Parrot Beauty.. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఈ మధ్య ఎంగేజ్‌మెంట్, పెళ్లి అంటూ కాస్త హడావిడి చేసింది.
కానీ, ఎందుకో ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనుకోండి. పెళ్లి క్యాన్సిల్ అయ్యాకా మళ్లీ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. సినిమాల సంగతెలా వున్నా.. ఓటీటీ కంటెంట్‌పై ఒకింత ఎక్కువగా దృష్టి పెట్టినట్లుంది మెహ్రీన్.
‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సీరీస్‌లో మెహ్రీన్ (Mehreen Pirzada) కనిపించింది. ఈ వెబ్ సిరీస్‌లో మెహ్రీన్ (Mehreen Pirzada) ఓ స్టన్నింగ్ రోల్‌లో కనిపించి మెప్పించింది.
Mehreen Pirzada Parrot Beauty.. గ్రీన్ హాట్ గ్లామర్..
తాజాగా ప్యారెట్ గ్రీన్ కలర్ (నిమ్మ పండు రంగు.. అని కూడా అనుకోవచ్చు) డ్రస్‌లో వయ్యారాలు పోతూ ఫోటోలకి పోజిచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్.
లాంగ్ ఫ్రాక్.. ఆ పై క్లీవేజ్ సోయగాలు.. మెహ్రీన్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. బోలెడన్ని లైకులూ, కామెంట్లూ షేర్లతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయ్.

ఇక మెహ్రీన్ సినిమాల విషయానికొస్తే.. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాల తర్వాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయలేదు. ‘స్పార్క్’ అనే ఓ సినిమాలో నటించింది.
ఇదో ఢిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ప్రోమోస్‌తో బాగా ఆకట్టుకుంది మెహ్రీన్ కౌర్ పిర్జాదా.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ, ప్రచార చిత్రాల్లో మెహ్రీన్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా కనిపించి స్పెషల్ కిక్కిచ్చింది ఫ్యాన్స్‌కి.
Also Read: ప్రేమలో మృణాల్ ఠాకూర్.! అంత పెద్ద తప్పు చేసేసిందా.?
అలాగే, తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ సినిమాల మీదా దృష్టి పెట్టింది మెహ్రీన్.
కన్నడలో ఆల్రెడీ ఓ ప్రాజెక్టులో నటిస్తోంది. అలాగే మరిన్ని ఓటీటీ కంటెంట్స్‌కి సంబంధించి కథలు వింటోందట మెహ్రీన్.!
వెండితెర అయినా, ఓటీటీ అయినా.. ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యమని మెహ్రీన్ పిర్జాదా అంటోంది.!