Memorandum Of Understanding ఇన్వెస్టర్స్ మీట్.! పార్టనర్షిప్ సమ్మిట్.! ఇలాంటివి ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయ్.! దావోస్లో జరిగినా, ఇంకో చోట జరిగినా.. వీటి వల్ల ఒరిగేదేంటి.?
నో డౌట్.! ఈ రోజుల్లో ప్రతిదానికీ ప్రచారం అవసరం. ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి.!
ప్రజాధనం ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం ఎంతవరకు అవసరం.? అన్నది వేరే చర్చ. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వాలు కోట్లు తగలేస్తున్న వైనాన్ని చూస్తున్నాం.
Memorandum Of Understanding.. అసలేంటీ ఎంవోయూ.!
ఎంవోయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్.. అచ్చ తెలుగులో అయితే, అవగాహనా ఒప్పందం.! ఎంవోయూ మీద సంతకాలు చేసేశామంటే, అక్కడికేదో అది వాస్తవ రూపం దాల్చినట్లే.. అనుకుంటే పొరపాటు.
మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అవగాహనా ఒప్పందం మాత్రమే.!
కానీ, రాజకీయం.. ఎప్పుడూ నిజాలు చెప్పదు. లక్షల కోట్ల ఒప్పందాలంటూ ఊదరగొట్టేయడమే పరిపాలన అయి కూర్చుందిప్పుడు.!
నేతి బీరకాయలో నెయ్యి ఎలా వుండదో, ఈ ఒప్పందాల్లో ‘అవగాహన’ కూడా అంతేనని అంటుంటారు ఆర్థిక రంగ నిపుణులు.!
గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్ని గౌరవించని కొత్త ప్రభుత్వాలు.. అలాంటప్పుడు, ఈ ‘అవగాహనా ఒప్పందాల్లో’ అర్థమేముంటుంది.?
Mudra369
ప్రభుత్వాలు చాలా చేయాలి.. ఇన్వెస్టర్లను మెప్పించాలి. ఈ క్రమంలో ప్రజలు త్యాగాలు చేయాలి.! అంటే, భూముల దగ్గర్నుంచి, ఇన్వెస్టర్లకు కావాల్సినవాటిని త్యాగం చేయాల్సింది ప్రజలే కదా.!
ఇంతా చేశాక, ఎన్ని ఉద్యోగాలొస్తాయ్.? అంటే, అది మళ్ళీ నేతి బీరకాయలోని నెయ్యి చందమే.!
అన్నీ అలాగే.. అనుకుంటే పొరపాటు.!
కొన్ని ఎంవోయూలు నిజంగానే కార్యరూపం దాల్చుతాయి. కానీ, వాటి సంఖ్య చాలా చాలా తక్కువ. నిజానికి, ఇలాంటివాటికి పెద్దగా ప్రచార ఆర్భాటం అవసరం వుండదు.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
లక్షల కోట్ల ఒప్పందాలనేవి కేవలం ప్రభుత్వాలు చేసే పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. అవేవో నిజమనుకుని జనం పొరపాటు పడితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ప్రభుత్వాలెప్పుడో ప్రజలకు నిజాలు చెప్పడం మానేశాయ్.! పబ్లిసిటీ స్టంట్లతో పబ్బం గడుపుకుని, జనాన్ని మభ్యపెట్టడానికే పాలకులు పరిమితమవుతున్నారు.