Table of Contents
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఇతరులకు షాక్ ఇవ్వడంలో దిట్ట. అయితే, ఆయనే షాక్ అయ్యే విషయమొకటి వుందట. అదే ‘మీ..టూ..’. ‘మీ..టూ..’తో వర్మ ఎందుకు షాక్ అయ్యాడో తెలుసా.? ఆయన మీద ఎవరూ ‘మీ..టూ..’ ఆరోపణలు చేయకపోవడం వల్లే తాను షాకయ్యానని వర్మ (Ram Gopal Varma Me Too) స్వయంగా చెప్పాడు.
బాలీవుడ్‌ని కుదిపేస్తోందిప్పుడు ‘మీ..టూ..’ అంశం. ఓ కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓ సినీ దర్శకుడు, ఓ ప్రముఖ నటుడు.. తమ తమ సినిమాల్ని ఈ ‘మీ..టూ..’ ఆరోపణల కారణంగానే వదులుకోవాల్సి వచ్చింది. కానీ, వర్మ పేరు మాత్రం ‘మీ..టూ..’ వివాదంలో విన్పించలేదు.
నన్ను విమర్శించినోళ్ళే ఇరుక్కున్నారు..
తనను ‘విమెనైజర్’గా కొందరు విమర్శిస్తుంటారనీ, అలాంటివారిలో కొందరు ‘మీ..టూ..’ వివాదంలో ఇరుక్కున్నారనీ, తన పేరు మాత్రం ‘మీ..టూ..’ (MeToo) ఆరోపణల్లోకి ఎక్కలేదని అది తనకు చాలా పెద్ద షాక్ ఇచ్చిందని వర్మ (Ram Gopal Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజమే, ఇది నిజంగానే చాలా ఆశ్చర్యకరం.
పోర్న్ స్టార్ మియా మల్కోవాతో (Mia Malkova) వర్మ ‘జిఎస్‌టి’ (GST) (గాడ్ సెక్స్ ట్రూత్) (God Sex and Truth) అనే వీడియో తెరకెక్కించాడు వర్మ. ఆ సమయంలో ఓ వ్యక్తి, వర్మ తన వద్ద నుంచి ఆ కాన్సెప్ట్‌ని కాపీ కొట్టాడనీ, అతని దగ్గర పనిచేసే సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనీ ఆరోపిస్తూ, మీడియాకెక్కిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.
‘భైరవగీత’కి అన్నీ తానే అయి..
విడుదలకు సిద్ధమైన ‘బైరవగీత’ (Bhairavageetha) సినిమా ప్రమోషన్‌కి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు రామ్‌గోపాల్ వర్మ (RGV). ఆయన శిష్యుడు సిద్దార్ధ ఈ ‘భైరవగీత’ను తెరకెక్కించాడు. వర్మ మరో విష్యుడు తెరకెక్కించిన ‘ఆర్‌ఎక్స్ 100’ (RX100) సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలుసు కదా? అంతకు మించిన విజయం ‘భైరవగీత’ దక్కించుకోబోతోందట. పేరుకే సిద్దార్ధ దర్శకుడు, సినిమా మొత్తం వర్మ పర్యవేక్షణలో జరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోందనుకోండి. అది ఇంకో సంగతి. ఈ సినిమాకి స్టార్ వాల్యూ అంటే అది వర్మ మాత్రమే.
‘ఆఫీసర్’ ఎందుకు తేడా కొట్టిందంటే..
అక్కినేని నాగార్జునతో (Akkineni Nagarjuna) ‘శివ’ (Shiva) లాంటి సినిమా వర్మ తీస్తాడనుకుంటే, అతి పెద్ద డిజాస్టర్‌ని ‘ఆఫీసర్’ (Officer Movie) రూపంలో నాగార్జునకి ఇచ్చాడు. ఇంత పెద్ద డిజాస్టర్ ఏంటి.? అనడిగితే, ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరన్నా సినిమా తీస్తారా.? అని ఎదురు ప్రశ్నించాడు వర్మ. ఫ్లాప్ సినిమా తీయాలని ఎవరూ అనుకోరనీ, ఒక్కోసారి నమ్మిన కథ అంచనా వేసిన విజయాన్ని అందివ్వబోదనీ, ఆ కథని తనతోపాటు నాగార్జున కూడా బాగా నమ్మాడని వర్మ చెప్పాడు. అందులో కథ ఏముంది.? అని జనం ప్రశ్నించొచ్చుగాక. అది వాళ్ళ ఇష్టం.
లక్ష్మీపార్వతికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథ చెప్పడట
స్వర్గీయ ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama rao) సతీమణి లక్ష్మీ పార్వతికి (Lakshmi Parvathi) ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (Lakshmis NTR) కథ చెప్పబోనని వర్మ క్లారిటీ ఇచ్చాడు. ‘కథ ఒకటి చెప్పి, సినిమా ఇంకోటి తీస్తే తప్పు లేదా.?’ అని ఎదురు ప్రశ్నించిన వర్మ, కథ మీదా.. కథ రాసిన వ్యక్తి మీదా నమ్మకం వుండాలని అన్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో తనను బాగా ఆకట్టుకున్న పాయింట్‌ని తీసుకుని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిస్తున్నానని వర్మ చెప్పాడు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.
https://youtu.be/ndMbgJm1ATk
దేవుడి మీద కాదు, భక్తుల మీదనే నమ్మకం లేదు..
”దేవుడ్ని నమ్ముతాను.. కానీ, భక్తుల్ని నమ్మను. దేవుడ్ని నమ్ముతానని చెబితే, చాలా చెడు పనులు చేయలేను.. స్వర్గీయ ఎన్టీఆర్‌కి, తిరుపతితో ప్రత్యేకమైన అనుబంధం వుంది. అందుకే, ఆ సినిమాని అక్కడినుంచే ప్రారంభించాం..” అని వర్మ ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. చచ్చిపోయే ముందు ‘నారాయణ’ అని కూడా అంటాడట వర్మ. ఎందుకంటే, పైకి వెళ్ళేటప్పుడు దేవుడు కన్పించే అవకాశం వుందనే నమ్మకం అట. అందుకే ఆయన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma Me Too) అయ్యాడు మరి.