Table of Contents
ఉన్నపళంగా మీ ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోతోంటే, ఒక్కసారి ఉలిక్కి పడండి. ఎందుకంటే, మీ ఫోనుని ఎవరో హ్యాక్ చేసి ఉండొచ్చు. మీకు తెలియకుండానే మీ చేతుల్లో ఉన్న ఫోనుని (Mobile Phone Hacking Safety Tips) ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తి వాడేస్తూ ఉండొచ్చు. మీరేమీ చేయకుండానే మీ ఫోనులోకి వైరస్ రావడం ఈ రోజుల్లో చాలా సర్వ సాధారణం.
ఫోను హ్యాకింగ్‌కి గురైందని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, హ్యాకింగ్ నుండి కొంతవరకూ దూరంగా ఉండొచ్చేమో. దాని కోసం మనం ఏం చేయాలి.? ముందుగా అవసరం లేని, యాప్స్ జోలికి వెళ్లడం మానేయాలి. దాంతో చాలా వరకూ సమస్య తగ్గుతుంది.
హ్యాకింగ్ అనుమానమొస్తే ఏం చేయాలి.?
తప్పదు.. నిపుణుల్ని ఆశ్రయించాల్సిందే. ఫోను రీబూట్ చేసుకోవడం ఉత్తమం. ఇంటర్నెట్ వినియోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ వంటి వాటి ద్వారా వచ్చే ఎలాంటి లింకుల్నీ టచ్ చేయొద్దు. ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చే లింకుల్నీ చూడొద్దు. అనుమానాస్పద నంబర్ల నుండి వచ్చే కాల్స్‌నీ అటెండ్ చేయొద్దు.
అతి ముఖ్యమైన ఇంకో అంశం.. మీ ఫోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ ఇవ్వొద్దు. స్నేహితులకు కూడా ఇవ్వడం క్షేమం కాదు. వీలైనంత వరకూ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్స్ మీ ఫోనులో ఉండేలా చూసుకోండి. మిస్డ్ కాల్ వస్తే, ఎవరో తెలియకపోతే, తిరిగి చేయకపోవడమే ఉత్తమం.
బ్యాంకుతో కనెక్ట్ అయితే, మరీ జాగ్రత్త..
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోను ఆధారిత బ్యాంకింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దాంతో స్మార్టుగా దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. మీ బ్యాంకు వివరాల విషయంలో అస్సలు రాజీ పడొద్దు. అనుమానాస్పద లావాదేవీల జోలికి వెళ్లొద్దు. ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం. మెయిన్ బ్యాంకు అకౌంట్‌ని స్మార్ట్ లావాదేవీలకు దూరంగా ఉంచడం, ఆన్‌లైన్ లావాదేవీల కోసం మరో అకౌంటు ఉపయోగించడం ఉత్తమం.
బ్యాంకు పేరుతోనో, క్రెడిట్ కార్డు పేరుతోనో ఫోన్లు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత వివరాలు చెప్పాల్సి వస్తే, అట్నుంచి వచ్చే కాల్ అసలైనదా.? కాదా.? అని ఒకటికి పది సార్లు (Mobile Phone Hacking Safety Tips) సరిచూసుకోవల్సిందే. లేదంటే, మొత్తం ఖాతా ఖాళీ అయిపోతుంది.
ఈ అనుమానాలొస్తే, జాగ్రత్త పడండి..
వాడకుండా కాస్సేపు ఫోను పక్కన పెట్టేసినా, ఫోను వేడెక్కుతోందంటే, దాన్ని మీకు తెలియకుండా ఎవరో ఉపయోగిస్తున్నట్లేనని అనుమానించాలి. ఇంటర్నెట్ డేటా అనుమానాస్పదంగా ఖర్చయిపోతుందంటే, మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడినట్లే.
మాట్లాడుతున్నప్పుడు కాల్ డిస్ర్టబెన్స్ తరచూ వచ్చినా, మీకు సంబంధం లేని మాటలు మధ్యలో కలిసినా అనుమానించక తప్పదు. మీ ఫోన్ డాక్టరు అదేనండీ.. అధీకృత టెక్నీషియన్ దగ్గరకు వెళ్లి, మీ సమక్షంలోనే ఫోను రీబూట్ చేయించుకోవాలి.
ఇవన్నీ చేసినా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఏం చేయలేం. వీలైనన్ని జాగ్రత్తలు (Mobile Phone Hacking Safety Tips) తీసుకోగలం అంతే.. ఆ పై దేవుడి దయ.