అనగనగా ఓ రాజ్ తరుణ్.! ఆమెని నమ్మించి మోసం చేశాడట.!
Raj Tarun Lavanya
Raj Tarun Lover Lavanya.. రాజ్ తరుణ్ తెలుసు కదా.? ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నటుడు.! మొదటి నుంచీ రాజ్ తరుణ్ పేరు చుట్టూ బోల్డన్ని వివాదాలున్నాయ్.!
తాజాగా, రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి, పోలీసుల్ని ఆశ్రయించింది. దాదాపు పదకొండేళ్ళుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారట.
అన్నట్టు, తమకు గుడిలో పెళ్ళి కూడా అయ్యిందని సదరు యువతి ఆరోపిస్తోంది. ఆమె పేరు లావణ్య. రాజ్ తరుణ్ స్నేహితురాలిగా లావణ్య గురించి సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసు. సినీ మీడియాకి కూడా.!
Raj Tarun Lover Lavanya.. కొత్త పిట్ట దొరికిందిరోయ్..
ఇకప్పుడు రాజ్ తరుణ్ – అవికా గోర్ మధ్య ‘భంచిక్’ నడుస్తోందంటూ పుకార్లు వినిపించాయి. తూచ్, అదంతా ఉత్త పుకారు మాత్రమేనని అటు రాజ్ తరుణ్, ఇటు అవికా గోర్ కొట్టి పారేశారు.
కొన్నాళ్ళ తర్వాత సీన్‌లోకి హెబ్బా పటేల్ పేరు వచ్చింది. కొన్నాళ్ళు ఈ జంట చుట్టూ బోల్డన్ని గాసిప్సులు. షరామామూలే, ‘తూచ్’ అనేశారు ఇద్దరూ.
‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని పాండేతోనూ రాజ్ తరుణ్ ‘భంచిక్’ అనే గాసిప్పుల్ని చూశాం. ఒకరా.? ఇద్దరా.? లెక్క తీస్తే, ఈ గాసిప్ రిలేషన్స్ లెక్కలు చాలానే కనిపిస్తాయ్.
సినీ రంగంలో మామూలే..
సినిమా అన్నాక గాలి వార్తలకు కొదవేం వుంటుంది.? వాటిల్లో కొన్ని నిజాలూ వుంటాయ్. నిజాలు గాలి వార్తలవుతాయ్.. గాలి వార్తలే నిజాలూ అవుతాయ్. అదే సినీ ‘మాయ’.!
ఇప్పుడేమో కొత్తగా మాల్వి మల్హోత్రా అనే కొత్త హీరోయిన్ పేరు, రాజ్ తరుణ్‌తో లిక్ అవుతోంది. ఆమె వల్లనే తనకు రాజ్ తరుణ్ దూరమయ్యాడని లావణ్య ఆరోపిస్తోంది.
తనకు రాజ్ కావాలంటోంది లావణ్య. ట్విస్ట్ అదిరింది కదా.! మోసం చేశాడంటోంది, అతనే కావాలంటోంది.!
మాల్వి మల్హోత్రా కోసమే తరచూ రాజ్ తరుణ్ ముంబై చెక్కేస్తున్నాడన్నది లావణ్య ఆరోపణ. నిజమేనా.? అంటే, ఈ మధ్య తరచూ రాజ్ తరుణ్ ముంబై వెళుతున్నాడన్న గాసిప్స్ అయితే వున్నాయ్.
Also Read: Tridha Choudhury: సరికొత్త గ్లామరాసనం.!
కొత్త సినిమా విడుదలకు ముందు కొన్ని పబ్లిసిటీ స్టంట్లు అచ్చం, నిజంలా అనిపిస్తుంటాయ్. ఇది కూడా అలాంటిదేనా.?
మొన్నీమధ్యనే ‘పరువు’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా, పోలీసులు తన కారుని తనిఖీ చేసినట్లుగా నివేదా పేతురాజ్ ఓ వీడియో విడుదల చేసింది.
ఆ పబ్లిసిటీ స్టంట్‌ని గుర్తు చేసుకుంటూ, రాజ్ తరుణ్ – లావణ్య – మాల్వి మల్హోత్రా ‘భంచిక్’ వ్యవహారాన్ని కొందరు కొట్టి పారేస్తున్నారు. కానీ, పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది కదా.? పోలీసులే, నిజాలు నిగ్గు తేల్చాలి.