Mudra369 Deepavali Subhakankshalu.. దీపావళి అంటే, టపాసులు.! వందలు కాదు, వేలు, లక్షలు వెచ్చించాలి దీపావళి పండుగ సందర్భంగా టపాసుల కోసం.!
ఇంత ఖర్చు చేసి, టపాసులు కొన్నాక.. సవాలక్ష ఆంక్షలు.! కాలుష్యం పెరిగిపోతుందనీ, ఇంకోటనీ.. టపాసులు కాల్చడానికి పెట్టే నిబంధనలు అన్నీ ఇన్నీ కావు.

ఏడాదికి ఓ రోజు.. వెలుగుల పండగ కదా.. దీపాలు వెలిగించడంతోపాటు, టపాసులు పేల్చడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
సంప్రదాయ టపాసులకు భిన్నంగా, భయంకరమైన శబ్దాన్ని చేసే టపాసులు.. ప్రమాదకరమైన టపాసులు.. మార్కెట్‌లోకి వచ్చేశాయి. వాటికి డిమాండ్ కూడా ఎక్కువే.
Mudra369 Deepavali Subhakankshalu.. దీపాల పండుగ..
దీపావళి అంటే, నిజానికి.. దీపాల పండుగ. పువ్వుల పండుగ.! పువ్వులు, దీపాలు.. వీటితోనే, దీపావళి నిండుగా వుంటుంది. ఆపై టపాసులు, పండక్కి కొత్త అందాన్ని తీసుకొస్తాయి.
పరిమితికి లోబడి టపాసులు పేల్చడం ఓ సంబరం.! ప్రమాదాలకు అస్సలేమాత్రం చోటివ్వకుండా టపాసులు పేల్చుకోవడం మంచిది.

చీకట్లో వెలుగునిచ్చేది దీపం.! ఆ దీపమే, కష్టాల చీకట్లో వున్నవారికి దారి చూపిస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం!
సనాతన ధర్మంలో దీపమే, దైవం.! చీకట్లని పారద్రోలేది దీపమే.! అందుకే, దీపాన్ని దైవంగా ఆరాధిస్తాం హిందువులం.
వీలైనన్ని ఎక్కువ దీపాల్ని ఇంటి చుట్టూ అలంకరించుకునే పండుగ దీపావళి. దీపావలి మరుసటి రోజు నుంచి, కార్తీక మాసం.!

అంటే, దీపావళి.. ఒక్క రోజు మాత్రమే కాదు.! దీపావళి తర్వాత, నెల రోజుల వరకూ దీపాల పండగే.!
కార్తీక మాసం అంతటా ఉదయం, సాయంత్రం.. దీపాల్ని వెలిగించడం శుభాల్ని కలిగిస్తుంది. కష్టాల్ని దూరం చేస్తుంది.

నరకాసుర వధ అనంతరం, ప్రజలంతా ఆ రాక్షుడి నుంచి విముక్తి కలిగిన నేపథ్యంలో జరుపుకున్న పండగగా దీపావళి గురించి చెప్పుకుంటాం.
అప్పటినుంచి, నరక చతుర్దశి అనంతరం.. దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.!
Also Read: బుర్రలు బద్దలాసుపోయే ప్రశ్న: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత.?
అర్థమయ్యింది కదా.. దీపావళిని ఆనందంగా జరుపుకోండి. ప్రమాదాలకు అస్సలేమాత్రం అవకాశమివ్వకండి. ప్రమాదరహితమైన టపాసులు మాత్రమే పేల్చండి. ప్రమాదకరమైన టపాసులు పేల్చకండి.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు..
