బిగ్‌హౌస్‌లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఈసారి ముక్కు అవినాష్ (జబర్దస్త్ కమెడియన్) (Mukku Avinash Bigg Wild Card Entry) హౌస్‌లోకి ‘జోకర్ గెటప్’తో ఎంట్రీ ఇచ్చేశాడు. నిజానికి, అంతకు ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి కూడా కమెడియనే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చాడుగానీ, హౌస్‌లో ఇప్పటిదాకా ఉద్ధరించింది ఏమీ లేదు.
సరైన కామెడీనే ఇప్పటిదాకా పండించలేదు. బోటు టాస్క్‌లో అనవసరమైన ఆర్గ్యుమెంట్ తర్వాత మరీ డల్ అయిపోయాడు. హౌస్‌లో ఎవరూ కుమార్ సాయిని లెక్క చేయట్లేదు. ముక్కు అవినాష్ అలా కాదు, వస్తూనే హౌస్‌లో జోష్ నింపేశాడు. అవినాష్ ఏవీ కూడా స్పెషల్‌గా డిజైన్ చేశారు.
పేద కుటుంబం నుంచి రావడం, ఇంటి సమస్యలు, లవ్ ఫెయిల్యూర్.. ఇలాంటివన్నీ ప్రస్తావిస్తూ ‘జోకర్’ నవ్వు వెనక బాధనీ పరిచయం చేసేందుకు ప్రయత్నించారు. మరోపక్క, హౌస్‌లో అందరితోనూ చాలా తక్కువ సమయంలోనే కలిసిపోయాడు.
పెద్ద కుటుంబం వుంది నాకు.. చాలా పెద్ద కుటుంబం.. నువ్వేమైనా నా గురించి ఆలోచిస్తావా.? అంటూ మోనాల్ గజ్జర్ మీద కూడా ఆటపట్టించే వ్యవహారాలు చేసేశాడు అవినాష్. ‘నిజమేనా.? నిజమేమాట్లాడుతున్నవా.?’ అంటూ మోనాల్ ఆశ్చర్యపోవడం ఆసక్తికర అంశమిక్కడ.
‘కొత్త వాడిని కదా.. నన్ను పక్కన పెట్టేస్తారా.?’ అంటూ సెటైర్‌తో మొదలైంది అవినాష్, బిగ్ జర్నీ. ఫుల్ ఎనర్జీతో హౌస్‌లో కనిపిస్తున్నాడు. హౌస్‌మేట్స్ కూడా అతనితో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఓ చిన్న ‘నాటీ పందెం’ వేసి, ఓడించేసి.. అవినాష్‌తో లేడీ గెటప్ వేయించి.. గంగవ్వతో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేయించేశారు ఇతర కంటెస్టెంట్స్. ఓవరాల్‌గా అవినాష్ అయితే, కొంత హౌస్‌లో జోష్ తీసుకురాగలిగాడు.
అయితే, అది ఎన్ని రోజులు అలా వుంటుందో ఇప్పుడే చెప్పలేం. కాగా, కుమార్ సాయి బిగ్‌హౌస్‌లో ఇకపై కొనసాగడం అనవసరం అన్న అభిప్రాయం వ్యూయర్స్ నుంచి వస్తోంది. హౌస్‌లోకి వచ్చాడు, వున్నాడు.. అంతే. అంతకు మించి, కుమార్ సాయి ఏమీ చేయడంలేదనే అర్థమవుతోంది. కానీ, ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. ఎందుకంటే ఫుల్ ఫుటేజ్ మనకి కనిపించదు కదా.!