Music Director Thaman.. నో డౌట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేస్తాడు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’, ‘అఖండ’ సినిమాలకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగా వర్కవుట్ అయ్యింది.
ఓ సాధారణ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో అద్భుతమైన సన్నివేశంగా మార్చగల సత్తా మ్యూజిక్ డైరెక్టర్లకు వుంటుంది. ఈ విషయంలో తమన్ వెరీ వెరీ స్పెషల్.
కానీ, అన్ని వేళలా ఆ మ్యాజిక్ వర్కవుట్ అయిపోతుందనుకుంటే ఎలా.?
తెలుగునాట బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనగానే ఒకప్పుడు మణిశర్మ పేరు గుర్తుకొచ్చేది. కానీ, ఆ మణిశర్మ ఇప్పుడెక్కడ.? ఆ మ్యాజిక్ ఇప్పుడు మణిశర్మలో ఎందుకు కొరవడింది.
ఇళయరాజా లాంటి మేటి సంగీత దర్శకులకే ఫెయిల్యూర్స్ తప్పలేదు. పాటలైనా, నేపథ్య సంగీతమైనా కొన్నిసార్లు తేడా కొట్టడం సర్వసాధారణమే. కాపీ ట్యూన్ల సంగతి సరే సరి.
Music Director Thaman.. ఫాఫం తమన్.! ఏంటీ కాపీ పంచాయితీ.!
‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలో తమన్ మీద గుర్రుగా వున్నారు మహేష్ అభిమానులు.
పవన్ కళ్యాణ్‌కీ, నందమూరి బాలకృష్ణకీ అదరగొట్టేశావ్.. మహేష్‌ని మాత్రం ముంచేశావంటూ సూపర్ స్టార్ అభిమానులు గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే.

మరోపక్క, ‘నీ పాటను నువ్వే కాపీ కొట్టేసుకుంటే ఎలా.?’ అన్న విమర్శ ఇటీవల తరచూ ఎదుర్కొంటున్నాడు తమన్.
‘అబ్బే, అసలు కాపీ కొట్టే ఆలోచనే వుండదు.. మన దగ్గర మంచి సాఫ్ట్‌వేర్ వుంది.. అది పసిగట్టేస్తుంది కాపీ ట్యూన్లను..’ అని కొన్నాళ్ళ క్రితమే క్లారిటీ ఇచ్చిన తమన్, ఇంకోసారి దాన్ని రిపీట్ చేశాడు.
దేవిశ్రీ ప్రసాద్ తక్కువోడేం కాదు.!
దేవిశ్రీ ప్రసాద్ కూడా అంతే. తన పాటల్ని తానే కాపీ కొట్టేసుకుంటుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగతి సరే సరి. ఒకేసారి నాలుగైదు సినిమాలకు వర్క్ చేయాల్సి వస్తే.. ఇలాగే వుంటుంది మరి.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
జరిగే చిన్న చిన్న తప్పుల్ని, కేవలం పొరపాట్లుగానే చూడాలి. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్లని నిందించేయడం తగదు.
అదే సమయంలో, ‘కాపీ’ విషయంలో అంతలా గుస్సా అవ్వాల్సిన పనేలేదు.. ‘ఏమో జరిగి వుండొచ్చు..’ అని కూల్‌గా చెప్పేస్తే పోయేదానికి.. వ్యవహారం వివాదస్పదమయ్యేదాకా ఎందుకు బుకాయించడం.?