Nabha Natesh Dating.. అసలు డేటింగ్ అంటే ఏంటి.? అబ్బాయి, అమ్మాయి కలిసి ఛిల్ అయితే తప్పేంటి.?
లాంగ్ డ్రైవ్‌కి కలిసి వెళ్ళొచ్చు.. ఒకే హోటల్ రూమ్‌లో ఎంజాయ్ చేయొచ్చు.. ఏదైనా చేసుకోవచ్చు. ట్రెండ్ మారింది మరి.!
డేటింగ్ అంటే ఈ రోజుల్లో చాలా చాలా సాధారణ విషయంగా మారిపోయింది. ‘డేటింగ్ తప్పు కదా.?’ అని ఎవరన్నా అంటే, వాళ్ళని ‘వింతగా’ చూసే లోకమిది.
డేటింగుకి వయసుతో సంబంధం లేదు. అబ్బాయి పర్సు ఘనంగా వుంటే చాలు.! ఒకవేళ అమ్మాయి దగ్గర దండిగా డబ్బులున్నా, కుర్రాడికి అది పండగే.
Nabha Natesh Dating.. ఇస్మార్ట్ బ్యూటీ డేటింగ్ ముచ్చట.!
డేటింగ్ కోసం చాలా యాప్స్ అందుబాటులో వున్నాయి. అయినా, ఈ రోజుల్లో డేటింగ్ కోసం యాప్స్ అవసరమా.? కాలేజ్ డేస్ నుంచి.. ఆ మాటకొస్తే స్కూల్ డేస్ నుంచే డేటింగ్ షురూ అవుతోంది.

పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్.. అన్నట్టు, డేటింగ్ చేయనివాడు బురద పంది అయి పుట్టున్.. అని అన్వయించాల్సి వస్తుందేమో.!
అయినాగానీ, అందుబాటులో డేటింగ్ వున్న అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోలేనివారు, ఆ అవకాశాలు సరిపోనివారు, కొత్తగా డేటింగ్ యాప్స్ ద్వారా కూడా తమ పైత్యాన్ని తీర్చుకోవచ్చు.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ అలాంటి ఓ డేటింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తోంది. డేటింగ్ చేయాలనుకుంటున్నారా.? అదీ తెలుగువారితో.. ఇంకెందుకు ఆలస్యం.. అంటూ క్యూటు క్యూటుగా తన పైత్యాన్నంతా రుద్దేసింది ఆ ప్రకటనలో.
ఇందుకే కదా.. యువత నాశనమైపోతున్నది..
బాగా చదువుకోండనో.. మంచి ఉద్యోగం చేసుకోమనో.. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోమనో.. జీవిత భాగస్వామితో వైవాహిక బంధాన్ని అద్భుతంగా కొనసాగించమనో చెబితే కిక్కేముంది.?
Also Read: పెళ్ళికి దర్శకత్వమట.! శోభనానికి ఏం చేస్తారట.!
మీకు నచ్చినోళ్ళని తగులుకోండి.. వైబ్ అవ్వండి.. ఎంజాయ్ చేయండి.. దానికి ఇదిగో, ఇక్కడ మీకు అలాంటోళ్ళు దొరుకుతారంటూ యాప్స్‌ని ప్రమోట్ చేయడాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి.

లోకం చెడిపోయిందనాలా.? లేదంటే, రకరకాల ఆంక్షల నుంచి స్వేచ్ఛా ప్రంపంచంలోకి ఇప్పుడిప్పుడే ఎగిరిపోతున్నాం అనాలా.? ఎవరి గోల వారిది.
అంతిమంగా, సెలబ్రిటీలంటే డబ్బులు సంపాదించుకోవాల. కంటెంట్ ఏదైతేనేం, ప్రమోట్ చేసేస్తే పోలా.?