Nabha Natesh Okka Chance.. స్టార్డమ్ వచ్చినట్లే వచ్చి చేజారిపోతే ఎలా వుంటుంది.? పాపం ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ పరిస్థితీ అదే. ఇంకేముంది.! ఇలియానా రేంజ్ స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారంతా.!
కానీ, సీన్ రివర్స్ అయిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో స్టార్డమ్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ‘అల్లుడు అదుర్స్’.. వంటి సినిమాలు చేసింది ఆ తర్వాత.
కానీ, అంతంత మాత్రం స్టార్‌డమ్‌తోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది నభా నటేష్‌కి. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ అడుగుతోంది.
Nabha Natesh Okka Chance.. కాస్తయినా పట్టించుకోరేం.!
పాపం ఇచ్చేయొచ్చుగా.! ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ అంటూ ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్‌కి ఛాన్స్ వుంటే బాగుండేదేమో.!
కానీ, కథ పరంగా ఆ ఛాన్స్ అస్సలు లేదు. పోనీ, ఇంకే సినిమాలోనైనా మంచి పాత్ర దక్కితే నభా తానేంటో ప్రూవ్ చేసుకుంటానంటోంది.

మొన్నామధ్య ఓ యాక్సిడెంట్‌కి గురై, కొన్నాళ్లు రెస్ట్‌లోకి వెళ్లిపోయింది. అందులోంచి తేరుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది నభా నటేష్ (Nabha Natesh).
ఈ ఇస్మార్ట్ గ్లామర్‌ని పట్టించుకునే నాధుడెవ్వడు.? సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ గ్లామర్ యాంగిల్స్‌లో ఫోటో షూట్లు చేయించుకుంటూ ప్రస్తుతం కాలక్షేపం చేసేస్తోంది నభా నటేష్.
Also Read : Komalee Prasad.. డాక్టరూ.! అందాల యాక్టరూ.!
కొత్తగా ఒప్పుకున్న ప్రాజెక్టులేమీ లేవు. తన అందాల తాకిడి తాకి, ఎవరో ఒకరు ఛాన్సివ్వకపోతారా.? అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది నభా నటేష్.
మొన్నామధ్య ఓ యాక్సిడెంట్‌కి గురై, కొన్నాళ్లు రెస్ట్‌లోకి వెళ్లిపోయింది. అందులోంచి తేరుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది నభా నటేష్.

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని డిఫరెంట్ ఫోటోలు పోస్ట్ చేసింది. లైట్ అండ్ షేడోతో ఆడుకోవడమంటే తనకెంతో ఇష్టం.. అంటూ ఈ ఫోటోలకి క్యాప్షన్ కూడా పెట్టింది.
ఓకే, నభా నటేష్ (Nabha Natesh). కెరీర్లో నీలి నీడలు తొలగిపోయి, బ్రైట్ లైట్ షేడ్స్ రావాలని ఆశిద్దాం.