Naga Shaurya Darshan.. దర్శన్ కాదు, కిల్లర్ దర్శన్.. అని లోకమంతా కోడై కూస్తోంది. న్యాయస్థానం తీర్పు వెల్లడించేవరకూ దర్శన్ కేవలం నిందితుడు మాత్రమే.
కానీ, న్యాయస్థానం ఎప్పుడు తీర్పునిస్తుంది.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇంతకీ, ఎవరీ దర్శన.? ఇంకెవరు, కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు.
భార్యని వదిలేసి, పవిత్ర గౌడ అనే సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడుట దర్శన్. చాలాకాలంగా నడుస్తోందిట ఈ వ్యవహారం.
ఈ రోజుల్లో అక్రమ బంధాలు, సహజీవనాలూ.. సహజాతి సహజం. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అని మనం జడ్జ్ చేయలేని పరిస్థితి.
Naga Shaurya Darshan.. హత్య చేశాడా.?
ఏకంగా తన అభిమానినే దర్శన్ చంపించేశాడన్నది ఆరోపణ. రేణుక స్వామి ఆ అభిమాని పేరు. అత్యంత కిరాతకంగా రేణుకా స్వామి హత్య జరిగింది.
ఈ హత్యలో ప్రధాన నిందితురాలిగా వుంది పవిత్ర గౌడ. దర్శన్ – పవిత్ర గౌడ మధ్య అక్రమ సంబంధాన్ని రేణుక స్వామి ప్రశ్నిస్తూ వచ్చాడట సోషల్ మీడియా వేదికగా.

దాంతో, దర్శన్ అభిమానులు గుస్సా అయి, అతన్ని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారట. దర్శన్ స్వయంగా తన అభిమాన సంఘానికి చెందిన కొందరితో, ఈ కిడ్నాప్ చేయించాడన్నది పోలీసులు చెబుతున్న విషయం.
అసలంటూ, హత్యకు పథక రచన చేసింది పవిత్ర గౌడ.. అని కూడా పోలీసులే చెబుతుండడం గమనార్హం.
కోపంతో కొట్టాను తప్ప, చంపలేదని దర్శన్, పోలీసులకు ‘రేణుక స్వామి’ హత్య కేసు విషయమై వాంగ్మూలం ఇచ్చాడట కూడా.
వేధింపులు తాళలేక..
సోషల్ మీడియా వేదికగా రేణుక స్వామి తమను వేధింపులకు గురిచేశాడనీ, ఆ వేధింపులు తాళలేక, కిడ్నాప్ చేసి బెదిరించాలనుకున్నామని ఇటు దర్శన్, అటు పవిత్ర గౌడ.. పోలీసుల విచారణలో చెప్పారట.
ఇన్ని ‘అట’లు వున్నాయి ఈ మిస్టరీలో.! ఈ క్రమంలోనే తెలుగు సినీ అభిమానులకీ, కన్నడ సినీ అభిమానులకీ మధ్య రగడ షురూ అయ్యింది.
కన్నడ నటుడు దర్శన్ మీద తెలుగు సినీ అభిమానుల కామెంట్ల నేపథ్యంలో దర్శన్ అభిమానులు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు.
ఈ గలాటా ఇలా జరుగుతున్న సమయంలో, దర్శన్‌కి అండగా నిలిచాడు టాలీవుడ్ నటుడు నాగ శౌర్య. దాంతో, విషయం మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read: ఇప్పుడు ‘ఆ టైపు‘ సినిమాలు తియ్యగలవా వర్మా.!
గెలుక్కోవడం తప్ప, నాగ శౌర్య ఈ విషయమై ఎందుకు స్పందించాలి.? విషయం పోలీసుల దృష్టికి, తద్వారా కోర్టు దృష్టికి వెళ్ళిన దరిమిలా, నాగ శౌర్య సంయమనం పాటించి వుండాల్సింది.
అయినా, దర్శన్‌కి నాగ శౌర్య సర్టిఫికెట్ ఇవ్వడమేంటో.. మంచోడని.! హత్య జరిగిన మాట వాస్తవం. హత్య విషయమై పవిత్ర, దర్శన్ తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులే చెబుతున్నారు.
ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తోంటే, నాగ శౌర్య ఏ ఉద్దేశ్యంతో దర్శన్‌కి మద్దతిచ్చాడోగానీ.. అనవసరంగా నాగ శౌర్య వివాదంలో ఇరుక్కుపోయినట్లయ్యింది.
నాగ శౌర్య కూడా దర్శన్ లాంటోడేనా.? అన్న చర్చ తెరపైకొస్తోందిప్పుడు.