Nagababu Janasena 2029 Elections.. జన సేన పార్టీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, ఎన్నికల్లో పోటీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేయాలా.? వద్దా.? అన్నదాని విషయమై నాగబాబు, తనదైన అభిప్రాయాన్ని కలిగి వుండటంలో తప్పేమీ లేదు.!
కాకపోతే, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదు.. అని నాగబాబు ప్రకటించడమే, ఒకింత కొత్త అనుమానాలకు కారణమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులకు, ఇదో ఆయుధంగా మారుతోంది.
Nagababu Janasena 2029 Elections.. పోటీ చేసి, ఓడిపోయి..
2019 ఎన్నికల్లో నాగబాబు, నర్సాపురం లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో పోటీ చేయాల్సి వున్నా, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు నాగబాబు.
కూటమి పొత్తుల పంపకాల కారణంగా, నాగబాబు పోటీ చేయాల్సిన లోక్ సభ నియోజకవర్గం, బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే నాగబాబుకి, ఎమ్మెల్సీ పదవి దక్కింది.
ఎమ్మెల్సీ పదవితోపాటు, మంత్రి పదవి కూడా నాగబాబుకి దక్కాల్సి వున్నా, మంత్రి పదవి విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు నాగబాబుకి మంత్రి పదవి వస్తుందో లేదో తెలియని పరిస్థితి.
కార్యకర్తగానే..
జన సేన కార్యకర్తగా పని చేయడానికే తాను ఎక్కువ ఇష్టపడతానని నాగబాబు అంటున్నారు. కానీ, పార్టీలో నెంబర్ టూ.. పొజిషన్ ఇప్పుడు నాగబాబుదే.
పార్టీకీ – కార్యకర్తలకీ మధ్య వారధిగా పని చేస్తున్నారు నాగబాబు. ప్రజా ప్రతినిథులకీ, పార్టీకి చెందిన ఇతర కీలక నేతలకీ, కార్యకర్తలకీ.. మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా నాగబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!
అయితే, 2029 ఎన్నికలకు చాలా సమయం వుంది. అప్పటికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారతాయో చెప్పలేం. ఏమో, నాగబాబు కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు.
అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, ‘నేను పోటీ చేయను’ అనే పరిస్థితి నాగబాబుకి వుండదు. జన సేన కార్యకర్తల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
మీడియా అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానమిచ్చారంతే.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది.. నాగబాబు మాట్లాడే ప్రతి మాటా ఆచి తూచి మాట్లాడాల్సి వుంటుంది.
