Nagababu Janasena Telugu Media జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుత రాజకీయాలు, ఆ రాజకీయాల్లో మీడియా పోషిస్తోన్న పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు నాగబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో జనసేన పార్టీ మీద ‘ప్యాకేజీ’ అంటూ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు వేస్తోన్న ‘ముద్ర’పై తీవ్రంగా స్పందించారు నాగబాబు.
Nagababu Janasena Telugu Media పూర్తి సారాంశమిదీ..
న్యూస్ ఛానల్స్ నిష్పక్షపాతంగా ప్రజలకి న్యూస్ అందించాలి. కానీ, అలా కోరుకోవడం ఈ రోజుల్లో అత్యాశ అవుతుందేమో.
పోనీ, ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్మ కాయడం అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ విజ్ఞత. కొంతమంది నీఛ రాజకీయ నాయకులు ఏదో తప్పుడు మాటలు మాట్లారంటే అది వాళ్ళ నీఛమైన మనస్తత్వం.
కానీ, కనీసం జర్నలిస్టిక్ వాల్యూస్ లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే న్యూస్ ఛానల్స్‌ని కానీ ఈ పత్రికల్ని కానీ ఏ పేరుతో పిలవాలి.?
మీరు గుడ్డ కాల్చి మొహం మీద వేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతారేమో అవినీతి రాజకీయ నాయకులు. కానీ, ఇక్కడున్నది పవన్ కళ్యాణ్.. నిప్పురా.. జాగ్రత్తగా రాతలు రాయండి.
మీరు కూర్చున్న చెట్టు కొమ్మల్ని మీరే నరుక్కుంటే కింద పడి చచ్చేది మీరే, జాగ్రత్త.
పవన్ కళ్యాణ్ మరో 25 ఇయర్స్ ప్రజల కోసం యుద్ధం చెయ్యగలడు. మీకు అంత ఓపిక లేదు.
ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి లేదిక్కడ. బడుగుబలహీన వర్గాల నుంచి వచ్చే నాయకులంటే మీకెందుకు లోకువ.? ఇంకెన్నాళ్ళు ప్యాకేజీ ప్యాకేజీ అంటూ వాగి ఛస్తారు.? అదే మాట మిగిలిన రెండు పార్టీల నాయకుల్ని అనడానికి మీకు దమ్ము లేదు.
ప్రజా సేవ కోసం వచ్చిన వాళ్ళు మా ప్రెసిడెంట్, మా లాంటి కార్యకర్తలు ఇలాంటి మాటల్ని పడతాం. మా ప్రెసిడెంట్‌ని కార్యకర్తల్ని వీర మహిళల్ని నీఛంగా మాట్లాడే మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు ఇంకెంతో దూరంలో లేదు.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
మీరు వాగిన ప్రతి అడ్డమైన వాగుళ్ళకీ సంజాయిషీ ఇచ్చుకునే రోజు దగ్గరలోనే వుంది. ఇంతకన్నా దిగి మాట్లాడ్డం నాకు చేతకాదు..
ఇట్లు.. కె.నాగబాబు.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదే మరి.! కానీ, అక్కడ మీడియాలోనూ.. రాజకీయాల్లోనూ విలువల వలువలూడ్చేసిన రాబందులున్నాయ్. వాటికి ఈ భాషలో చెబితే అర్థమవుతుందా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.