Nagma Actress Congress Party.. కొనుక్కుంటే రాజ్యసభ సీట్లు వస్తాయ్.. అని రాజకీయాల్లో ఓ బలమైన వాదన వుంది. పలు సందర్భాల్లో ఆయా పార్టీలు ఖరారు చేసే రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ చూస్తే, అందులో అపర కుబేరులు కనిపిస్తారు మరి.!
పోటీ వుండదు గనుక, ఖచ్చితంగా గెలుస్తారు గనుక.. రాజ్యసభకు పోటీ పడే రాజకీయ నాయకులు, రాజకీయాలతో సంబంధం లేకపోయినా, చట్ట సభలకు వెళ్ళి ఆయా రాజకీయ పార్టీలకు ఆర్థికంగా అండదండలు అందించేవాళ్ళు ఎక్కువగా వుంటుంటారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ కోసం పద్ధెనిమిదేళ్ళు కష్టపడిన సినీ నటి నగ్మా.. ఆ పద్ధెనిమిదేళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోయిందంటూ వాపోయింది.
అయ్యోపాపం నగ్మాకి ఎంత కష్టమొచ్చిందో.!
నగ్మా చాన్నాళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలూ నిర్వహించారామె. ప్రధానంగా తమిళనాడు మీద నగ్మా రాజకీయంగా స్పెషల్ ఫోకస్ పెట్టడం చూశాం.

కాంగ్రెస్ పార్టీలో నగ్మా చేరినప్పుడే, ఆమెకు పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని స్వాయానా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హామీ ఇచ్చారట. మరి, ఆ హామీ ఏమయ్యిందో ఏమో.!
తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థుల వివరాల్ని ప్రకటించగా, అందులో నగ్మా పేరు కనిపించలేదు. తన పేరు కనిపించకపోయేసరికి నగ్మా తెగ బాధపడిపోయింది.
Nagma Actress Congress Party .. నగ్మా కష్టం పగవాడిక్కూడా రాకూడదు.!
‘బహుశా నేను ఇంకాస్త తక్కువ కష్టపడ్డానేమో..’ అంటూ కాంగ్రెస్ పార్టీ మీద ఆమె పరోక్షంగా విసుర్లు వేశారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
అయినా, సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వెళ్ళడమే నగ్మా చేసిన అతి పెద్ద తప్పు.. అంటారు ఆమె అభిమానులు. కాంగ్రెస్ పార్టీని వదిలెయ్.. బీజేపీలో చేరిపో.. అంటూ నగ్మాకి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు.