Nara Bhuvaneshwari TDP అమ్మ ఎవరికైనా అమ్మే.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి అయినా.. నారా లోకేష్ తల్లి భువనేశ్వరి అయినా.. ఇద్దరూ ‘అమ్మ’లే.! ఇద్దరూ మహిళలే.!
వైఎస్ విజయలక్ష్మి, తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి రావడం తెలిసిన విషయమే.! ఆమె అలా జనంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
ఇక, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, జైలుకు వెళ్ళిన దరిమిలా, తన భర్తని అక్రమంగా అరెస్టు చేశారని నారా భువనేశ్వరి జనంలోకి వచ్చారు.
Nara Bhuvaneshwari TDP.. ప్రజల్లోకి వెళ్ళడమంటే రోడ్డెక్కడమా.?
ప్రజల్లోకి వెళ్ళడం.. అంటే, ‘రోడ్డెక్కడం’ అనే కొత్త ప్రస్తావనకు తెరలేపింది నీఛ నికృష్ట పాత్రికేయం.! దీన్ని పాత్రికేయం అని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
వైఎస్ విజయలక్ష్మి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, ఆ తర్వాత రాజకీయ తెరపైనుంచి కనుమరుగయ్యారు.
భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా.? రారా.? అన్నది ముందు ముందు తేలుతుంది. ఆమె, జనానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు. జనం ఎలా ఆమె మాటల్ని రిసీవ్ చేసుకుంటారన్నది వేరే చర్చ.
తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్ళినప్పుడు, పార్టీ బాధ్యతల్ని పూర్తిగా భుజాన వేసుకుని జనంలో తిరిగారు వైఎస్ విజయమ్మ.
ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలు తెగ్గొట్టుకుని..
విజయమ్మతోపాటు వైఎస్ షర్మిల కూడా వైఎస్సార్సీపీ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. కానీ, విజయమ్మ కావొచ్చు, షర్మిల కావొచ్చు.. ఇప్పుడు జగన్ వెంట లేరు.
అసలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోనే తమకు సంబంధం లేదన్నట్టుగా విజయలక్ష్మి, షర్మిల వ్యవహరిస్తుండడం వెనుక, బలమైన కారణమేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.!
నారా భువనేశ్వరి అంటే, స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఆమె.!
Also Read: అ‘నిల్’ రావిపూడీ.! శ్రీలీల ఐటమ్ సాంగ్ లేదేం.?
తండ్రి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆమె ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడింది లేదు.!
భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ భువనేశ్వరి రాజకీయాలపై మాట్లాడలేదు. పరిస్థితులు ఆమెతో రాజకీయాలు మాట్లాడేలా చేశాయ్.!
సరే, ప్రజా తీర్పు ఎలా వుంటుంది.? అన్నది ముందు ముందు తేలుతుంది. అయినా, ఓట్లను కరెన్సీ నోట్లతో రాజకీయ పార్టీలు కొనేస్తున్నప్పుడు.. ప్రజా తీర్పు.. అంటే అదో పెద్ద బూతుగానే చూడాలి.!