Table of Contents
రష్మిక మండన్న.. (Rashmika Mandanna) పరిచయం అక్కర్లేని పేరిది. రాత్రికి రాత్రి స్టార్‌డమ్ కలిసొచ్చేసిందని అంతా ఆమె గురించి అనుకుంటారుగానీ, ఈ స్టార్‌డమ్ వెనుక.. చాలా కష్టం దాగి వుందని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది. చిన్నప్పటినుంచే నటన మీద మక్కువ పెంచుకుంది రష్మిక (National Crush Rashmika Mandanna).
తొలుత మోడలింగ్, ఆ తర్వాత సినిమా కెరీర్.. ఈ క్రమంలో ఆమె చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. 1996 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారింది యువత దృష్టిలో. చాలామంది అమ్మాయిలకు రోల్ మోడల్ రష్మిక మండన్న. కుర్రాళ్ళకైతే కలల రాణి.
మేడమ్ అంటే.. మేడమ్ అంతే.
‘డియర్ కామ్రేడ్’ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నని ఉద్దేశించి మేడమ్.. అని అంటుంటాడు.. అలా చూస్తే, కుర్రాళ్ళందరికీ క్యూట్ మేడమ్.. అనే చెప్పాలేమో.
చాలామంది హీరోయిన్లతో పోల్చితే, రష్మిక (Hbd Rashmika Mandanna) అభిమానులు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే, అభిమానుల్ని ఆమె అంత ప్రత్యేకంగా డీల్ చేస్తుంది గనుక. ‘నన్ను ఏమైనా అనుకోండి.. నా అభిమానుల్ని ఏమన్నా అన్నారో.. ఊరుకునేది లేదు..’ అంటూ ఆ మధ్య ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది రష్మిక. దాంతో, రష్మిక అభిమానుల సంఖ్య అప్పటినుంచి మరింత వేగంగా పెరిగిపోయింది.
ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్ రష్మిక
రష్మికకి (Happy Birthday Rashmika Mandanna) డాన్స్ అంటే ఇష్టం. ఫిట్‌గా వుండడమంటే మరింత ఇష్టం. సినిమా ప్రమోషన్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. నిజానికి, తాను నటించే సినిమాని ప్రమోట్ చేయడం ఇష్టం అనే కంటే, అది తన బాధ్యత అని చెబుతుంటుంది రష్మిక.
‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక పడ్డ కష్టం, ఆమెకు మరింత ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. మంచి నటి, మంచి డాన్సర్.. అందానికి అందం.. వీటితోపాటుగా లక్కు కూడా రష్మిక (National Crush Rashmika Mandanna) మండన్నకి బాగా కలిసొచ్చింది.
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్.. అనదగ్గ అతి కొద్దిమందిలో రష్మిక పేరు ముందు వరుసలోనే వుంటుందనడం అతిశయోక్తి కాదు. తెలుగులోనే కాదు, తమిళంలోనూ రష్మికకి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
సౌత్ నుంచి బాలీవుడ్ వరకూ.. మేడమ్ మేనియా..
ఈ మధ్య బాలీవుడ్‌లో కూడా రష్మిక పేరు మార్మోగిపోతోంది. అక్కడ రెండు సినిమాలు ఇప్పటికే సైన్ చేసేసింది రష్మిక (Rashmika Mandanna). మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి. ఏ భాషలో సినిమా చేసినా, ఆ భాష నేర్చేసుకోవడానికి రష్మిక పడే తపన అంతా ఇంతా కాదు.
తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా.. డెడికేషన్ పరంగా ఎక్కడా తేడా రాలేదనీ, రాదనీ.. అదే తన సక్సెస్ సీక్రెట్ అనీ చెబుతుంటుంది రష్మిక. నేషనల్ క్రష్.. అనే ట్యాగ్ తనలో బాధ్యతను మరింత పెంచిందని అంటోంది రష్మిక మండన్న. తన సొంత నేల కర్నాటక అయినా.
దేశమంతా (National Crush Rashmika Mandanna) తనకు అభిమానులున్నరనీ, తెలుగు నాట తెలుగింటి ఆడపడుచులా.. తమిళనాట, తమిళమ్మాయిగా.. బాలీవుడ్‌కి వెళితే, ముంబై భామగా తనను ఎక్కడికక్కడ ఆదరిస్తున్న అభిమానులకు రుణపడి వుంటాననీ, వారి అంచనాల్ని అందుకోవడానికి ఎప్పటికప్పుడు కష్టపడుతూనే వుంటానని రష్మిక మండన్న అంటోంది.