Table of Contents
Navneet Kaur.. నవనీత్ కౌర్ గుర్తుందా.? అదేనండీ, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అంధుడిగా నటించిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేచురల్ బ్యూటీ నవనీత్ కౌర్.!
ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. స్పెషల్ సాంగ్స్‌లో కూడా సందడి చేసింది. ‘యంగ్ యమా..’ అంటూ ‘యమదొంగ’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ఆడిపాడింది కూడా.!
స్టార్ హీరోయిన్ అవుదామనుకుందిగానీ, సినిమాల్లో తన స్థాయికి తగ్గ రీతిలో ఆమె రాణించలేకపోయిందన్నది నిర్వివాదాంశం. అయితేనేం, రాజకీయాల్లో మాత్రం ‘లేడీ డైనమైట్’ అనే గుర్తింపు తెచ్చుకుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో నవనీత్ కౌర్ ఇప్పుడు హాట్ టాపిక్.
Navneet Kaur.. రాజకీయం వేరే లెవల్.!
మహారాష్ట్రలో శివసేన సర్కారుని ముప్పు తిప్పలు పెట్టేస్తోంది నవనీద్ కౌర్. నవనీత్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆమె భర్త రవి రాణా, అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా రగడ వెనుక నవనీత్ కౌర్, ఆమె భర్త రవిరాణా వ్యూహాత్మక రాజకీయం సుస్పష్టం. అయితే, అధికార మదంతో శివసేన సర్కారే, రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందన్నది నవనీత్ ఆరోపణ.
అరెస్టు, జైలు, బెయిలు.. తర్వాత సీఎం కుర్చీయేనా.?
ఈ వ్యవహారంలో నవనీత్, ఆమె భర్త రవి రాణా అరెస్టయ్యారు.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు కూడా.
ఇకనేం, జైలుకెళ్ళొచ్చిన నవనీత్ కౌర్, ముందు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోతుందేమోనన్న చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, రాజకీయాల్లో చాలా కాన్ఫడెంట్‌గా.. కాదు కాదు, చాలా చాలా కాన్ఫిడెంట్‌గా నవనీత్ కౌర్ కన్పిస్తోంది. ఇంతటి డైనమిజం ఆమెకు ఎలా వచ్చింది.? అని అంతా విస్తుపోతున్నారు.
నవనీత్ కౌర్ తెలుగు ముద్ర.!
అడపా దడపా నవనీత్ కౌర్ మన తెలుగు మీడియాతోనూ మాట్లాడుతుంటుంది.. తెలుగు నేలకు సంబంధించిన సమస్యలపైనా పార్లమెంటులో ప్రస్తావిస్తానంటుది నవనీత్ కౌర్.
Also Read: చిరంజీవి దేవుడట.! పవన్ కళ్యాణ్ దెయ్యమట.!
రాజకీయాల్లో ‘శివంగి’ అనదగ్గ అతి కొద్దిమంది లేడీ డైనమైట్స్‌లో నవనీత్ కౌర్ ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు.