Nayanthara.. ‘శుభం పలకరా మగడా అంటే పెళ్ళికూతురు డాష్.. అన్నాడట వెనకటికి ఒకడు’. ఇది పాత ముతక సామెత.!
ఇప్పుడీ పాత ముతక సామెత ఎందుకంటే, ఓ సిద్ధాంతి.. నయనతార జాతకం గురించి చెప్పాడు. పెళ్ళి ఆమెకు కలిసి రాదట. విడాకులు తప్పవట.
వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఎవర్ని పెళ్ళి చేసుకున్నాగానీ.. భర్తతో కలిసి వుండబోదని సోకాల్డ్ సిద్ధాంతి ఒకడు శాసించేశాడు.
ఈ సిద్ధాంతిగాడే, సమంత – అక్కినేని నాగచైతన్య విడిపోతారని ముందే జోస్యం చెప్పాడట.
సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నారు కాబట్టి, వీడి జాతకం నిజమే అవుతుందని చాలామంది అమాయకులు ఆ బూచాడి ట్రాప్‌లో పడిపోవడంలో వింతేముంది.?
పెళ్ళంటే.. ఆ హంగామానే వేరు.!
అసలు పెళ్ళి ఎలా జరుగుతుంది.? జాతకాలు, సుముహూర్తాలు.. చాలా పెద్ద కథ నడుస్తుంది. అలా అన్నీ కుదిరాక పెళ్ళి జరిగితే, వాటిల్లో ఎన్ని నిలబడుతున్నాయి.?

రోజులు మారాయ్.! ఈ రోజుల్లో పెళ్ళి అంటే కొంతమందికి జస్ట్ పబ్లిసిటీ వ్యవహారం. సహజీవనానికి పెళ్ళి అనే కలరింగ్ ఇచ్చి, పార్ట్ టైమ్ వైవాహిక జీవితాల్ని కొందరు ఎంజాయ్ చేస్తున్నారు.
నయనతార విషయానికొస్తే, కొన్నాళ్ళు తమిళ సినీ నటుడు శింబుతో ప్రేమాయణం కొనసాగించింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమలో పడింది.
Nayanthara.. అదో పేద్ధ కథ.!
అటు శింబుతో కొంతకాలం, ఆ తర్వాత ప్రభుదేవాతో ఇంకొంతకాలం సహజీవనం చేసింది నయనతార. ఈ రోజుల్లో అదేమీ నేరం కాదు కూడా. తాజాగా ఇప్పుడు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో వుంది నయనతార.
నయనతార – విఘ్నేష్ శివన్ చాలాకాలంగా సహజీవనంలో బిజీగా వున్నారు. వైవాహిక బంధంతో ఒక్కటవ్వాలని ఈ మధ్యనే ఫిక్సయ్యారట.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
అదెంత నిజమో తెలియదు. ఇలా పెళ్ళి పుకారు బయటకొచ్చిందో లేదో, విడాకులంటూ సదరు సిద్దాంతిగాడు, శాసనం చేసి పారేశాడు.
అద్గదీ అసలు సంగతి. పెళ్ళి చేసుకుంటే కలిసి వుండలేరా.? సహజీవనంలో అయితే ఎన్నేళ్ళయినా ఇబ్బంది వుండదా.? ఇదెక్కడి పంచాయితీ.? చెప్పేవాడికి వినేవాడు లోకువ అనేది ఇందుకే మరి.