Neha Aisha Sharma Sisters.. చేసే సినిమాల సంగతెలా వున్నా, అందాల ఆరబోతలో మాత్రం ఈ అక్కా చెల్లెళ్లు వీళ్ల్లకి వీళ్లే సాటి. ఒకరితో ఒకరు తెగ పోటీ పడుతుంటారు.
సోలో అందాల దాడితో పాటూ, జంట అందాల దాడితోనూ పిచ్చెక్కిస్తుంటారు.
మా ఇద్దరిలో ఎవరెంత అందంగా వున్నామో చెప్పుకోండి చూద్దాం.. అన్నట్లుగా ఫజిల్ విసురుతున్నట్లుంటాయ్ ఈ ముద్దుగుమ్మల పోజులు.
ఇంతకీ ఎవరా హాట్, హాటర్ అండ్ హాటెస్ట్ సిస్టర్స్.. అనుకుంటున్నారా.? నేహా శర్మ, ఐషా శర్మ. ‘శర్మ సిస్టర్స్’గా ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు గ్లామర్‌లో మంచి పేరుంది.
Neha Aisha Sharma Sisters.. అక్క అలా.. చెల్లెలు ఇలా.!
కానీ, సినిమాల్లోనే పెద్దగా సీనూ సినిమా లేకుండా పోతోంది. తెలుగులో నేహా శర్మ ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఒకటి, రెండు సినిమాలు తప్ప పెద్దగా ఛాన్సులు దక్కించుకోలేదు.

ఐషా శర్మ సంగతీ అంతే. మెగా తనయుడితో ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, కాస్తో కూస్తో నేహా శర్మని గుర్తుంచుకున్నారు కానీ, ఐసా శర్మకు మాత్రం పాపం అలా గుర్తు పెట్టుకోదగ్గ సినిమా ఏదీ పడలేదింతవరకూ.
అన్నట్లు ఈ మధ్య మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా సినిమాలో ఐషా శర్మకి ఛాన్స్ ఇచ్చారన్నారండోయ్. ఒకవేళ అదే నిజమైతే, కనీసం ఇప్పటికైనా ఐషా శర్మ అందాలకు ఓ విలువ దక్కినట్లేనండోయ్.
డబుల్ డోస్ గ్లామర్ తళుకుల్.. మ్యాగజైన్ మెరుపుల్..
ఆ సంగతి అటుంచితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ అక్కచెల్లెల్లిద్దరూ (Neha Sharma Aisha Sharma) ఆల్వేస్ హాట్ సెన్సేషనే.
తాజాగా ఈ అందాల అక్కా చెల్లెళ్లు FHM అనే ఓ మ్యాగజైన్ కవర్ పేజీ మీద తళుక్కున మెరిశారు.

ఏ మాటకి ఆ మాటే చెప్పాలి.. ఈ పోజుల్లో శర్మ సిస్టర్స్ (Sharma Sisters) కిల్లింగ్ లుక్స్‌కి క్లీన్ బౌల్డ్ అవ్వని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదేమో.
Also Read: Krithi Shetty.. అంతలా తిట్టొద్దు ప్లీజ్.!
అందుకేగా ఇప్పుడీ అందాల పోజులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్. ఇంకెందుకాలస్యం మీరూ ఓ లుక్కేసి, చెరో కామెంట్ వేస్కోండి మరి.!