Neha Sharma Mobility.. అందం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అంటుంటారు అందాల భామలు.! అందులోనూ, శారీరక అందం.. మానసిక అందం.. వేర్వేరనేవారూ లేకపోలేదు.!
ఇక్కడ, ఈ అందాల భామ మాత్రం ‘Mobility is as important as weight training’ అని సెలవిస్తోంది.!
చక్కనమ్మ ఏం చెప్పినా అందంగానే వుంటుందని అనుకోవాల్సిందే.! అంతే మరి.! ఇంతకీ, ఎవరీ భామ.?
అలా మర్చిపోతే ఎలా.? తెలుగులో తన తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుందీ బ్యూటీ.! పైగా, అది మెగా ఫిలిం.!
Neha Sharma Mobility.. చిరుత బ్యూటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) తెరంగేట్రం చేసిన ‘చిరుత’ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైందీ ఈ బ్యూటీ. పేరు గుర్తుకొచ్చింది కదా.. నేహా శర్మ.!
సోషల్ మీడియాలో వైల్డ్ అండ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ఈ బ్యూటీ, తన చెల్లెలు ఐషా శర్మ (Aisha Sharma)తో కలిసి మరీ వర్కవుట్స్ గట్టిగానే చేసేస్తుంటుంది.

ఫిట్నెస్ అంటే అమ్మడికి చాలా చాలా మక్కువ ఎక్కువ.! ట్రావెలింగ్ అంటే కూడా బాగా ఇష్టం నేహా శర్మకి. నేహా శర్మ తండ్రి పొలిటీషియన్ కూడా.
గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా నేహా శర్మ (Neha Sharma) పాల్గొంది. అయితే, ప్రత్యక్ష రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదట.
Also Read: కియారా అద్వానీకి ‘గేమ్ ఛేంజర్’ బర్త్ డే విషెస్.!
ప్రస్తుతానికైతే వెబ్ సిరీస్‌లు, మ్యూజికల్ ఆల్బమ్స్.. వెరసి, టైమ్ పాస్ అయిపోతోంది ఈ బ్యూటీకి యాక్టింగ్ కెరీర్ పరంగా.!
తెలుగులో ‘చిరుత’ తర్వాత, వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే మరో సినిమాలోనూ నటించింది నేహా శర్మ (Neha Sharma).
చాలాకాలం గ్యాప్ తీసుకుని, నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో ఓ గెస్ట్ రోల్‌లో నేహా శర్మ (Neha Sharma) కనిపించిన సంగతి తెలిసిందే.