Nenu Vinnanu Nenu Vunnanu.. ఒకే ఒక్క డైలాగ్.. సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి ట్రైలరొచ్చింది.. అందులోని డైలాగ్ వైరల్ అయ్యింది.
‘నేను విన్నాను.. నేను వున్నాను..’ అంటూ సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Maheshbabu), ఈ సినిమాలోని హీరోయిన్ కీర్తి సురేష్‌తో చెబుతాడు. ఏ సందర్బంలో ఎందుకు చెప్పాడు.? అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
ఈ డైలాగ్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) శ్రేణుల్ని ఉత్సాహంతో ఊగిపోయేలా చేస్తోంది.
అందుక్కారణం, 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ‘నేను విన్నాను.. నేను వున్నాను..’ అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు.
Nenu Vinnanu Nenu Vunnanu.. సినీ రాజకీయమ్.!
అదే డైలాగ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్‌బాబు నోట ‘సర్కారు వారి పాట’ సినిమాలో వినిపించింది.
అన్నట్టు, గతంలో ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తే, ‘జగన్ అనే నేను..’ అంటై వైసీపీ (YSR Congress Party) శ్రేణులు బీభత్సంగా దాన్ని వాడేసుకున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు కాంగ్రెస్ మనిషి. ఆయన తనయుడు నయా సూపర్ స్టార్ మహేష్‌బాబు రాజకీయాల జోలికి వెళ్ళలేదు. కానీ, వైసీపీ శ్రేణులు మహేష్‌బాబుని ‘ఓన్’ చేసేసుకున్నాయి.
ర్యాగింగా.? ఫాలోయింగా.?
ఇదిలా వుంటే, సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో (Sarkaru Vaari Paata) ‘నేను విన్నాను నేను వున్నాను’ అనే డైలాగ్ ‘ర్యాగింగ్ తరహాలో వుండబోతోంది’ అనే ప్రచారం జరుగుతోంది.
Also Read: నెల తక్కువ (తప్పిన).. మామిడికాయ్.!
ఇంతకీ అది ర్యాగింగా.? ఫాలోయింగా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.! సినిమా రిలీజ్ అయితే క్లారిటీ వచ్చేస్తుందిగా.!