Megastar Title Mania.. సుప్రీం హీరో కాస్తా, మెగాస్టార్ అయ్యింది.! ఔను, చిరంజీవికి ఇంటి పేరుగా మారిపోయింది ఒకప్పుడు ‘సుప్రీం హీరో’ టైటిల్, ఆ తర్వాత ‘మెగాస్టార్’ టైటిల్.!
ఇది చిరంజీవికి అభిమానులు ఇచ్చిన టైటిల్. సగటు సినీ అభిమాని ఇచ్చిన టైటిల్. దర్శకులు, నిర్మాతలు.. యావత్ తెలుగు సినీ పరిశ్రమ చిరంజీవికి ఇచ్చిన టైటిల్ ‘మెగాస్టార్’.!
భారతీయ సినీ తెరపై మెగాస్టార్ అంటే, చిరంజీవి మాత్రమే.! బాలీవుడ్ మెగాస్టార్ అనీ, ఇంకోటనీ.. పలువురు హీరోలకు ఈ ‘మెగాస్టార్’ అనే టైటిల్ పెట్టడం చూస్తూనే వున్నాం.
ఈ మధ్యన తెలుగునాట, నందమూరి కళ్యాణ్‌రామ్‌కీ, అల్లు అర్జున్‌కీ.. ఈ ‘మెగాస్టార్’ అనే టైటిల్ పెట్టేసి, సోకాల్డ్ నెటిజన్లు విపరీతమైన పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Megastar Title Mania.. బింబిసార మెగాస్టార్..
‘బింబిసార’ సినిమా టైమ్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు, తమ అభిమాన హీరో పేరు ముందర ‘మెగాస్టార్’ టైటిల్‌ని అతికించేందుకు ప్రయత్నించారు, కానీ వాళ్ళ పప్పులుడకలేదు.
తాజాగా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో కొందరు, ‘మెగాస్టార్ అల్లు అర్జున్’ అంటూ, కొత్త వివాదానికి తెరలేపారు.

అయితే, అల్లు అర్జున్, ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి’ అంటూ ట్వీటేసి, ఆ సోకాల్డ్ ‘ఆర్మీ’కి పెద్ద షాకే ఇచ్చాడు.!
నిజానికి, ‘మెగాస్టార్’ అనే టైటిల్ కొట్టేయడం చాలా తేలిక. చూస్తున్నాం కదా. సోషల్ మీడియా పైత్యం ఎలా వుందో.
కానీ, మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఎదగాలంటే, ఆషామాషీ వ్యవహారం కాదు. 150కి పైగా సినిమాలు చేశారు, చేస్తున్నారింకా చిరంజీవి.
చిరంజీవి.. శిఖర సమానుడు..
చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్, కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ బ్యాకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే, చిరంజీవి కీర్తి ప్రతిష్టలకు ఆకాశమే హద్దు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణ్.. ఇలా చిరంజీవి పేరు ముందర చాలా వున్నాయ్.! ఇవేనా.? వందలాది పాటలకు చిరంజీవి స్టెప్పులేశారు. డాన్సుల్లో చిరంజీవి తర్వాతే ఎవరైనా.!
మెగాస్టార్.. అంటే, అది జస్ట్ టైటిల్ కాదు. అంతకు మించి.! నందమూరి కళ్యాణ్ రామ్ అయినా, అల్లు అర్జున్ అయినా.. ఆ టైటిల్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అంతా ఇంతా కాదు.
కొంతమంది నెటిజనం ఆయా హీరోల మీద ‘అభిమానం’ ముసుగులో వేసే చిల్లర వేషాలు, మెగాస్టార్ అనే టైటిల్ స్థాయినిగానీ, చిరంజీవి స్థాయిని గానీ అస్సలేమాత్రం తగ్గించలేవు.
చిరంజీవి అంటే శిఖర సమానుడు.! కొండని చూసి కుక్కలు మొరిగితే.. ఆ కొండకి చేటా.?
