Table of Contents
New Constituion In India… భారత రాజ్యాంగం చాలా గొప్పది. చాలా చాలా గొప్పది. అందుకే, ఈ దేశంలో స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యాన్నిచ్చింది. ఇంకా చాలా చాలా ఇచ్చింది. రాజ్యాంగం ద్వారా హక్కులు మాత్రమే సంక్రమిచాయ్ అనుకుంటే పొరపాటు. హక్కులతో పాటే బాధ్యతలూ వుంటాయ్.
కానీ, బాధ్యతల్ని విస్మరించిన మనం, హక్కులు గురించి మాట్లాడుతుంటాం. అదే అసలు సమస్య. ఎవరి పని వాళ్లు చిత్తశుద్ధితో చేస్తే అసలు సమస్యే వుండదు. తాము తప్పులు చేస్తూ వ్యవస్థలోని లోటు పాట్లను ఎత్తి చూపేవాళ్లని ఏం అనాలి.?
New Constituion In India.. రాజ్యాంగం మార్చేద్దాం. ఏం కామెడీగా వుందా.?
తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని అభిప్రాయ పడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టలేం. భారత పౌరుడు ఎవరైనా ఇలాంటి ప్రశ్న లేవనెత్తవచ్చు. తన అభిప్రాయాన్ని కుండ బద్దలుగొట్టవచ్చు. రాజ్యంగం మనకు కల్పించిన హక్కు అది.
Also Read: చట్ట సభల్లో నేర చరితులు: పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
కానీ, రాజ్యాంగం మార్చేద్దాం.. కొత్త రాజ్యాంగం రాసేద్దాం.. అనే ముందు మనం ఏం చేస్తున్నాం.? అనే ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా. ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధుల్ని తమ పార్టీలోకి లాక్కుని మంత్రి పదవుల్ని కూడా కట్టబెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది ఏం నైతికత.?
చెప్పేటందుకే నీతులు..
చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ డాష్ గుడిసెలు.. అన్నట్లు ఎవరైతే వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తున్నారో వాళ్లే వ్యవస్థల ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు.

ఇది ఒక కేసీఆర్ గురించో, ఇంకొకరి గురించో ప్రత్యేకించి మాట్లాడుకుంటున్న అంశం కాదు. దాదాపుగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలూ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయ్.
ఎన్నికల్లో గెలవడం కోసం ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయ్. అధికారం కోసం అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నాయ్. మరి కొత్త రాజ్యాంగాన్ని రాసేదెవరు.? దేశంలో కొత్తగా రాజ్యాంగం రాయాలంటే, మకిలి అంటని ఓ శక్తి కావాలి. ఈ రోజుల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో అది సాధ్యమేనా.?
కొత్త రాజ్యాంగం కాదు, బుర్రల్లోంచి చెత్త తొలగిపోవాలి
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే, నిర్భయ చట్టం తెచ్చుకున్నాం.హైద్రాబాద్‌లో దిశ ఘటన జరిగితే, ఆ దిశ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాం. కొత్త చట్టాలు వచ్చి ఏం ప్రయోజనం.?
చట్టాలేవీ ఇలాంటి అఘాయిత్యాల్ని ఆపలేవు. మన బుర్రల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించగలిగితే, వున్న చట్టాలతోనే అఘాయిత్యాలకు ఆస్కారం లేకుండా చేయగలం.
Also Read: డిజిటల్ ‘ముద్ర’.. ఈ రాజకీయ పైత్యపు సిత్రం సూడరో.!
రాజ్యాంగం విషయంలోనూ ఇంతే. కొత్త రాజ్యాంగం అవసరం లేదు. వున్న రాజ్యాంగాన్ని వున్నట్లుగా గౌరవిస్తే చాలు. రాజ్యాంగం ప్రకారం (New Constituion In India) అందరూ నడుచుకుంటే, సమస్య ఏముంది.?