Table of Contents
Nidhhi Agerwal HHVM Promotions.. ఓ సినిమాని కష్టపడి తెరకెక్కించడం ఓ యెత్తు.. ఆ సినిమాకి అవసరమైన మేర పబ్లిసిటీ చేసుకోవడం ఇంకో యెత్తు.!
సినిమాకి పబ్లిసిటీ చేసుకోవాలంటే, హీరో అలానే హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఏదో ఒక రకంగా తమవంతు కృషి చేయాల్సిందే.
మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఇలా చాలానే కథ వుంది పబ్లిసిటీ అంటే.!
ఇంతకీ, ‘హరి హర వీర మల్లు’ పరిస్థితేంటి.? సినిమా పబ్లిసిటీ సంగతేంటి.? నిర్మాత ఏఎం రత్నం పబ్లిసిటీ చేస్తే సరిపోతుందా.? హీరోయిన్ నిధి అగర్వాల్ కష్టపడితే సరిపోతుందా.?
కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, పవన్ కళ్యాణ్ తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకున్నది లేదు. సినిమా పబ్లిసిటీకి ఆమడ దూరం ఆయన.
అయితే, కొన్ని సినిమాలకు మాత్రం పవన్ కళ్యాణ్ ‘పబ్లిసిటీ’ చేయాల్సి వచ్చింది.. అదీ, కొంత కాలమేననుకోండి.. అది వేరే సంగతి.
పబ్లిసిటీ జిమ్మిక్కులు సినిమాని ఆడిస్తాయా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయితే, ఎంతోకొంత పబ్లిసిటీ అయితే చేసుకోవాలి కదా.?
Nidhhi Agerwal HHVM Promotions.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కష్టమే..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వున్నారు. మరోపక్క, ‘ఓజీ’ షూటింగ్ వ్యవహారాల్లోనూ ఆయన బిజీగా వున్నారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. రెండు పడవల ప్రయాణం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌ని నిర్మాత ఏఎం రత్నం ఇబ్బంది పెట్టే పరిస్థితే లేదు. పవన్ కళ్యాణ్‌ని ఏఎం రత్నం కంటే బాగా ఇంకెవరు అర్థం చేసుకోగలరు.?
‘ఆయనకున్న బాధ్యతల నేపథ్యంలో, సినిమా ప్రమోషన్లకు రారు.. పవన్ కళ్యాణ్ మీద ఈ విషయమై ఒత్తిడి పెట్టలేను’ అని స్వయంగా ఏఎం రత్నం ఆ మధ్యన ఓ సందర్భంలో చెప్పేశారు కూడా.
మరెలా.? అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వున్నారు కదా.. బాధ్యత తీసుకోవడానికి.
సోషల్ మీడియా హోరెత్తుతోంది..
సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇంకా సరిగ్గా రాకపోయినా, వున్నదాంతోనే సంతృప్తి పడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సొంతంగా ఎడిట్లు చేసుకుని మరీ, ప్రమోషన్స్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.

పోస్టర్లు, వీడియోలు.. వాట్ నాట్.. ఈ కంటెంట్, సినిమా టీమ్ నుంచి వస్తున్న కంటెంట్ కంటే కూడా ఇన్నోవేటివ్‌గా కనిపిస్తోంది. అదే ‘హరి హర వీర మల్లు’కి అడ్వాంటేజ్ అవుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. తెరపై, టైటిల్స్‌లో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే పేరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
నిధి అగర్వాల్ సమ్‌థింగ్ వెరీ స్పెషల్..
ఇక, నిధి అగర్వాల్ అయితే, ఈ సినిమా ప్రచార బాధ్యతల్ని పూర్తిగా భుజానికెత్తుకుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చట్లు క్రమం తప్పకుండా పెడుతోంది.
ఇంకోపక్క, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, వాటితోపాటుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో ఆడి పాడటం.. వెరసి, ‘పంచమి’ నిధి అగర్వాల్, పబ్లిసిటీ విషయంలో అస్సలు తగ్గడంలేదు.
Also Read: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సమీక్ష: ఆ నరుక్కోవడం జుగుప్సాకరం.!
ఈ విషయంలో నిధి అగర్వాల్‌ని అభినందించి తీరాల్సిందే. సినిమాని ప్రమోట్ చేయడంలో కొందరు హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, నిధి అగర్వాల్ రూటే సెపరేటు.
అందుకే, నిధి అగర్వాల్‌ని పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓన్’ చేసేసుకున్నారు.