Table of Contents
‘సర్కారు వారి పాట’ టైమ్‌లో మహేష్ బాబుతో ఇంటర్వ్యూ చేసింది నిహారిక (Niharika NM). అప్పట్లో ఎవరీ నిహారిక.? అంటూ నెటిజనం తెగ వెతికేశారు గూగుల్‌లో.
‘లైగర్’ టైమ్‌లో విజయ్ దేవరకొండనీ ఇంటర్వ్యూ చేసింది. ‘లాల్ సింగ్ చద్దా’ కోసం అమీర్ ఖాన్‌తోనూ ఇంటర్వ్యూ చేసింది. ‘కేజీఎఫ్’ హీరో యష్‌నీ ఇంటర్వ్యూ చేసింది (Niharika NM).
ఇలా సౌత్ నుంచి నార్త్ వరకూ స్టార్ సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేసింది నిహారిక. ఓస్.! ఓ యాంకర్ అయ్యుంటుందిలే అనుకుంటున్నారా.? అయితే తప్పులో కాలేసినట్లే.!
ఈమె ఆఫ్ర్టాల్ యాంకర్ కాదు, ఫేమస్ సెలబ్రిటీ. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తే ఫేమస్ సెలబ్రిటీలు అయిపోతారా.? అని మళ్లీ పెదవి విరుస్తున్నారా.?
నిహారిక ఇంటర్వ్యూలు అలా ఇలా వుండవ్ మరి. వన్స్ యాక్షన్‌లోకి దిగితే, ఇక అంతే. అదేంటీ ఇంటర్వ్యూ అంటారు. మళ్లీ యాక్షన్ అంటారేంటీ.? అని ఇంకో డౌటా.?
ఎవరీ Niharika NM? ఏంటా కథ.?
అయితే, ఈ నిహారిక గురించి పూర్తిగా తెలియాల్సిందే. బెంగుళూరులో పుట్టింది. అక్కడే చదువుకుంది. ఎం.ఎస్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్లింది. ప్రస్తుతం అక్కడే వుంది.
స్టార్ సెలబ్రిటీలను సరదాగా ఇంటర్వ్యూ చేయాలనుకుంది. అందుకోసం పెద్ద సెటప్పే వుందనుకోండి ఈ పాపకి. అలా సెలబ్రిటీలతో చేసిన ఫన్నీ ఇంటర్వ్యూలను యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసింది. వేలు, లక్షల్లో ఫాలోవర్స్‌ని సంపాదించింది.

ఇంకేముంది.. అలా ఫేమస్ అయిపోయిందంతే. ఇప్పుడర్ధమైందనుకుంటా.! నిహారిక ఎవరు.? అని. అవునండీ జస్ట్ ఓ యూ ట్యూబర్ నిహారిక. కానీ, బహు ఫేమస్.
అందుకు కారణం ఆమె ఇంటర్వ్యూలు చేసేందుకు ఎంచుకున్న డిఫరెంట్ మార్గమే. సాదా సీదా ఇంటర్వ్యూల్లా కాకుండా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆయా ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తుంటుంది నిహారిక.
ఆమె రూటే సెపరేటు..
స్టార్ హీరోలతో గొడవలు, గిల్లి కజ్జాలు, యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా ఒక్కటేమిటీ.? కంటెంట్ కోసం నిహారిక చేయనిది లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఆమె ఇంటర్వ్యూలంటే పడి చచ్చిపోతుంటారు నెటిజన్లు.
తమ తమ సినిమాల ప్రమోషన్ల కోసం స్టార్ హీరోలు స్వయంగా నిహారికకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అత్యుత్సాహం చూపిస్తుంటారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. నిహారిక పాపులారిటీ ఏ రేంజ్ అని.
తెలుగుతో పాటూ, సౌత్ భాషలన్నీ తెలుసు నిహారికకు. ఒక్క మలయాళం తప్ప. ఎక్కువగా ఆమె ఇంటర్వ్యూలు ఇంగ్లీష్‌లోనే వున్నప్పటికీ ఆయా భాషల హీరోలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయా ప్రాంతాల యాసలోకి తన స్లాంగ్ మార్చేసుకుంటుంది నిహారిక. అలా ఆయా భాషల్లో నిహారికకు ఊహించని విధంగా ఫ్యాన్ బేస్ ఫామ్ అయ్యింది..
ఇదేనా నిహారిక ప్రొఫెషన్.?
నిహారిక జస్ట్ ఓ చదువుకునే అమ్మాయి అంతే. ఏదో సరదాగా స్టార్ట్ చేసిన ఈ యూ ట్యూబ్ వీడియోలు క్లిక్ అయ్యాయ్. దాంతో నిహారిక ఫేమస్ అయిపోయింది.
యూ ట్యూబ్ అంటేనే పెద్ద టైమ్ వేస్ట్ యవ్వారం. అయితే, యూ ట్యూబ్‌లో టైమ్ పాస్ కోసం వీడియోలు చూసే వాళ్లే ఆయా యూ ట్యూబర్లకు రాజ పోషకులు. అలా తన వీడియోలతో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో నిహారిక ఫేమస్ అయిపోయింది.
Also Read: Avantika Dassani.. ‘ప్రేమ పావురం’ నట వారసత్వం.!
నిహారిక ఎన్.ఎమ్ ఇలా యూ ట్యూబర్‌గానే సెటిలైపోతుందా.? అంటే, అదేదో సరదాగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో తెలీదంటోంది నిహారిక.
కానీ, ఇలా వీడియోలు చేసేవాళ్లు ఓ టార్గెట్ అంటూ పెట్టుకుని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెగిటివిటీ అనేది ఎక్కడైనా వుంటుంది. దాన్ని పట్టించుకుని, అక్కేడ ఆగిపోకూడదు. సీరియస్‌గా తీసుకుని కొంచెం జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్లండి.. బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది.. అని అప్ కమింగ్ యూ ట్యబర్లకు స్వీట్ సజిషన్ ఇస్తోంది నిహారిక.