Nikhil Spy Movie Controversy ఏమయ్యింది యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థకి.? నిర్మాతతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నట్టు.?
నిఖిల్ సిద్దార్ధ హీరోగా ‘స్పై’ (Spy Movie) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ కూడా వచ్చింది.
అయితే, చిత్రంగా ఆ లిరికల్ సాంగ్, నిఖిల్ సిద్దార్ధ (Nikhil Siddhartha) సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కనిపించలేదు.!
Nikhil Spy Movie Controversy.. ఏం చేస్తున్నావ్ నిఖిల్.?
తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో నిఖిల్ (Nikhil Siddhartha) చాలా చాలా అప్రమత్తంగా వుంటాడు. ఎందుకో, ఈసారి వ్యవహారం తేడా కొడుతోంది.
సినిమా (Spy Movie)) రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతతో నిఖిల్‌కి (Nikhil Siddhartha) అభిప్రాయ బేధాలొచ్చాయట.

ముందు అనుకున్నట్లుగానే ‘స్పై’ సినిమాని విడుదల చేయాలన్నది నిర్మాత ఉద్దేశ్యమని అంటున్నారు. కానీ, నిఖిల్ అందుకు ససేమిరా అంటున్నాడట.
ప్రమోషన్స్ కోసం సమయం కావాలి కదా.?
ఇంకా ఈ సినిమాకి నిఖిల్ డబ్బింగ్ చెప్పాల్సి వుంది. చిన్నా చితకా ప్యాచప్ వర్క్స్ కూడా వున్నాయట. సో, ప్రమోషన్స్‌కి సమయం సరిపోదన్నది నిఖిల్ వాదన అట.
అయితే, నిఖిల్ (Nikhil Siddhartha) మీద ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ, అతన్ని ఈ వివాదంలో విలన్‌గా చూపే ప్రయత్నం జరుగుతోందన్న వాదనా లేకపోలేదు.
ఒక్కటి మాత్రం నిజం. సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతదే అంతిమ నిర్ణయం కావాల్సి వుంది. అదే సమయంలో, హీరో చెప్పే సూచన కూడా నిర్మాత పాటిస్తే మంచిది.
Also Read: Kriti Sanon.. ఓ సీత.! ఓ కాంట్రవర్సీ.! ఓ ‘ఆదిపురుష్’.!
నిఖిల్ సిద్దార్ధ (Nikhil Siddhartha) సరసన ఈ ‘స్పై’ (SPY Movie) సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, ఈ వివాదంపై ఇంతవరకూ నిఖిల్ (Nikhil Siddhartha( ఎందుకు స్పందించలేదు.?