Nikita Dutta Yoga. యోగాసనాలు ఎందుకు వెయ్యాలి.? శరీరం విల్లులా ఎందుకు వంచాలి.? అతిగా వంచేస్తే ఏమవుతుంది.?
యోగా అనేది ఇప్పుడో జీవన విధానంగా మారిపోయింది.! ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా తప్పనిసరైపోయింది.
ఎంత ఉరుకుల పరుగుల జీవితం అయినా సరే, వీలైతే వుదయం లేదంటే సాయంత్రం ఇలా ఏదో ఒక టైమ్‌లో యోగా చేయకుంటే అనారోగ్యానికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినట్లే అవుతోందంటూ నిపుణుులు హెచ్చరిస్తూనే వున్నారు.
Nikita Dutta Yoga,, వాళ్లు యోగా చేయకూడదా.?
పిల్లా పెద్దా, వయసూ తారతమ్యం లేకుండా ఎవరైనా యోగా చేయొచ్చు.
అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే.. అంటే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి తప్ప, యోగా ఎవరైనా చేయొచ్చు.
నిజానికి, ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. తేలికపాటి యోగాసనాలతో కొంత ఉపశమనం పొందొచ్చని చెబుతుంటారు వైద్యులు.!
గుండె నొప్పితో బాధపడేవారికి కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సూచిస్తుంటారు.

అలాగే, ఆస్తమా తదితర శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికీ కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలున్నాయ్.
ఆయా యోగాసనాలు ఆయా అనారోగ్య సమస్యల్ని నియంత్రించడంతో పాటూ, అంతకు మించిన ఆరోగ్యాన్ని కూడా పెంపొిందిస్తుంటాయ్.
వైద్యుల సూచనతో, నిపుణులైన యోగా గురువుల సమక్షంలో యోగాసనాలు వేయడం వల్ల ఎలాంటి సమస్యలూ వచ్చే అవకాశం లేదు.
బరువు తగ్గడానికే కాదు..
కేవలం బరువు తగ్గడానికే యోగా చేయాలా.? కానే కాదు.. యోగా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటూ, శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది.
అందుకే అందాల భామలు ముఖ్యంగా యోగాసనాలను ప్రమోట్ చేస్తుంటారు. తమదైన శైలిలో యోగాసనాలు వేస్తూ, శరీరాన్ని విల్లులా వంచేస్తుంటారు.
Also Read: Shilpa Shetty.. అప్పుడూ.. ఇప్పుడూ మెరుపు తీగే.!
ఆరోగ్యానికి ఆరోగ్యం.. తమ అందాలకు పబ్లిసిటీ.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా ముద్దుగుమ్మలు యోగాసనాలు ప్రయత్నిస్తుంటారు.
తమ నాజూకు అందాలను మరింత అందంగా కాపాడుకునేందుకు ఈ ముద్దుగుమ్మలకు యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తుంటాయ్.
చూస్తున్నారుగా ఈ ఫోటోలోని బ్యూటీ నిఖితా దత్తా (Nikitha Dutta). యోగా పేరు చెప్పి, శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచేస్తుంది కదా. మోస్ట్ బ్యూటిఫుల్ .!