తెలుగువాళ్ళై వుండి కూడా తెలుగుకి తెగులు పట్టించేసి, ‘టెల్గు’ అంటూ పనికిమాలిన వయ్యారాలు ఒలకబోసే, సోకాల్డ్ అందాల భామలు ఆమెని (Nithya Menen Telugu) చూసి చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిందే.!
నిత్యా మీనన్.. పరిచయం అక్కర్లేని పేరది.. ‘అలా మొదలైంది’ అంటూ తెలుగు తెరపైకొచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్, ఎన్నో తెలుగు సినిమాలతో తెలుగు నాట తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
సినిమా అంటే అదో అందమైన ప్రపంచం. తారలంటే చాలా చాలా సున్నితంగా వుంటారు. వారిని చూసేందుకు జనం ఎగబడతారు.
Mudra369
నటించడమే కాదు, పాటలు పాడుతుంది కూడా. దర్శకత్వంపైనా అవగాహన వుందీమెకి. తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను కదా.. తెలుగులో మాట్లాడకపోతే ఎలా.? అంటుందామె.
Nithya Menen Telugu.. టీచింగ్.. మొదటి నుంచీ ఆసక్తి..
నటించడం ప్రొఫెషన్.. పాటలు పాడటం హాబీ.. టీచింగ్ అనేది నా డ్రీమ్.. ఇలా పలు సందర్భాల్లో నిత్యా మీనన్ చెబుతూ వచ్చింది.

అవకాశం వచ్చిందో, అవకాశం తీసుకుందోగానీ.. ఓ స్కూల్లో టీచరమ్మ అవతారమెత్తింది సినీ నటి నిత్యా మీనన్.
తాను విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ (వీడియో) చేస్తూ నిత్యా మీనన్ వెల్లడించింది.
ప్రభుత్వ స్కూళ్ళో.. సినిమా టీచర్..
సినిమా అంటే అదో అందమైన ప్రపంచం. తారలంటే చాలా చాలా సున్నితంగా వుంటారు. వారిని చూసేందుకు జనం ఎగబడతారు.
కానీ, నిత్యా మీనన్ ఎలాంటి హంగూ, ఆర్భాటాలకు తావివ్వకుండా.. తాను ఓ సినిమా షూటింగ్ చేస్తోన్న ప్రాంతానికి దగ్గర్లో వున్న స్కూలుకు వెళ్ళి విద్యార్థులకు పాఠాలు చెప్పింది.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
ఇంగ్లీషులో చెబుతూ.. దాన్ని తెలుగులోకి అనువదిస్తూ.. నిత్యా మీనన్ చెప్పిన పాఠం.. అభినందనీయమే. ఈ మధ్య పలువురు నటీ నటులు స్కూళ్ళలో పాఠాలు చెప్పడంపై మక్కువ ప్రదర్శిస్తున్నారండోయ్.
సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతే ఇదే మరి.! తెలుగుతో ఏం పని.? ఇంగ్లీషు వుంటే చాలనుకునే మూర్ఖులకీ ఇదొక గుణపాఠం.!