Table of Contents
Nitish Kumar Bihar JDU.. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారాయన. అది కూడా, బీహార్ లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా.!
నితీష్ కుమార్.. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరది.! ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినా, నితీష్ కుమారే సీఎం అభ్యర్థి బీహార్‌లో.!
చాలా ఏళ్ళుగా నడుస్తున్న ఓ ప్రసహనం ఇది. మధ్యలో అప్పుడప్పుడూ, నితీష్ కుమార్ దిగిపోతుంటారనుకోండి.. అదీ తక్కువ కాలమే. ఆ తర్వాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి.!
Nitish Kumar Bihar JDU.. ఏ పార్టీతో అయినా ఇట్టే కలిసిపోతారు..
కాంగ్రెస్ పార్టీతో జతకడతారు, ఆ పార్టీతో స్నేహాన్ని వద్దనుకుంటారు. బీజేపీ పంచన చేరతారు, బీజేపీకి దూరమవుతారు.
మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరడం, ఇంకోసారి బీజేపీతో జత కట్టడం.. అబ్బో, నితీష్ కుమార్ రాజకీయ సర్కస్సుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అయితేనేం, నితీష్ కుమార్ హయాంలో బీహార్ రూపు రేఖలు మారాయంటారు అక్కడి ప్రజానీకం. అందుకే, ఏ రాజకీయ పార్టీ అయినాగానీ, నితీష్ కుమార్ విషయంలో ఒకింత పద్ధతిగా వ్యవహరిస్తుంటుంది.
ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు మామూలే.! ఎన్నికలయ్యాక మాత్రం, నితీష్ కుమార్ అందరివాడు.. అయిపోతారంతే.!
అవసరార్ధం రాజకీయం..
కాదు కాదు, తన అవసరార్థం నితీష్ కుమార్.. ఆయా పార్టీల పంచన చేరుతుంటారు. చిత్రంగా ఆయా పార్టీలు కూడా, ‘అప్పట్లో అలా అన్నావ్ కదా.?’ అని బెట్టు చేయవ్.!
నితీష్ కుమార్ (Nitish Kumar) అడగ్గానే మద్దతిచ్చేస్తాయ్.. అప్పటిదాకా ఆయన్ని విమర్శించే పార్టీలు కూడా. అదే ఆయన ప్రత్యేకత.!
Also Read: రాజమౌళీ.! మీ నాన్నని అదుపులో పెట్టుకో.!
ప్రస్తుతం బీజేపీ మద్దతుతో మళ్ళీ గద్దెనెక్కారు నితీష్ కుమార్. గద్దెనెక్కడం ఆయనిష్టమే.. గద్దె దిగడం కూడా ఆయనిష్టమే.! నితీష్ కుమార్‌కి అలా సాగుతోంది.!
నువ్ మామూలోడివ్ కాదు నితీషూ.. అనేది ఇందుకే మరి.!
ప్రధాని పదవిపై కన్నేసి..
అన్నట్టు, ప్రధాని పదవిపై కన్నేసి ప్రధాని నరేంద్ర మోడీని ఢీకొట్టేందుకు విపక్షాల్ని ఒక్కతాటిపైకి తెచ్చిన నితీష్ కుమార్, చిత్రంగా.. ఆ బీజేపీ పంచన చేరారు.!
విపక్ష కూటమిని నితీష్ కుమార్ నట్టేట్లో ముంచేసిన వైనం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.!