నోయెల్ సీన్ (Noel Sean Bigg Boss Telugu 4) ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో వుంటాడు. ఇది అందరికీ తెల్సిన విషయమే. ర్యాపర్‌గా అతని ఎనర్జీ ఏంటో ఆయన పాటల్లో స్పష్టమవుతుంది. హీరోయిన్ ఎస్తేర్ నూరున్హాని ప్రేమించి పెళ్ళాడాడుగానీ, కొన్ని కారణాలతో ఇద్దరూ ఇటీవల చట్టబద్ధంగా విడిపోయారు.
ఆ విషయం పక్కన పెడితే, బిగ్ హౌస్‌లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంగ్‌గా ఆల్రెడీ నోయెల్ సీన్‌కి ముద్ర పడిపోయింది. చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతున్నాడు. గేవ్‌ు పట్ల పూర్తి అవగాహన వున్నట్లే కన్పిస్తోంది నోయెల్ సీన్ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి చూస్తే, హౌస్‌లో చిన్న చిన్న సమస్యల్ని కూల్‌గా పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తున్నాడు.
నో డౌట్, నోయెల్ చాలా మంచి ఎంటర్‌టైనర్. హౌస్‌లో అందరికన్నా ఎక్కువ ఎంటర్‌టైన్ చేయగల సత్తా వున్నోడు. కానీ, అతన్ని ఆ స్థాయిలో ఎంటర్‌టైన్ చేయనిచ్చేలా బిగ్‌హౌస్‌లో పరిస్థితులు వుంటాయా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఎందుకంటే, హౌస్‌లో 24 గంటల్లో ఏం జరుగుతుందోగానీ, అందులో మనకి చూపించేది పూర్తిగా ఓ గంట కూడా కాదు. సో, ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. నోయెల్‌కి ‘నో’ చెప్పడానికి కంటెస్టెంట్స్‌కి కూడా పెద్దగా రీజన్స్ కనిపించకపోవడం గమనార్హం.
అందరితోనూ కలుపుకుపోయేతత్వం వున్నోడే అయినా, బిగ్‌బాస్ ఎలాగైనా ఫిటింగులు పెట్టేయగలడు. ఎవరికి వారే, హై ఓల్టేజ్ పవర్ వున్నోళ్ళే కావడంతో, చిన్న సమస్య పెను ఉత్పాతం సృష్టించేయొచ్చు హౌస్‌లో. ఏ సమస్యా లేకపోయినా యుద్ధాలు జరిగిపోతాయ్. అలా జరిగినప్పుడే నోయెల్ (Noel Sean Bigg Boss Telugu 4) ఎంత స్ట్రాంగ్.? ఎంత వీక్.? అనేది తేలిపోతుంది.
నోయెల్ సీన్ (Noel Sean) డాన్సులేయగలడు, పాటలు పాడగలడు, ఫన్ క్రియేట్ చేయగలడు, గేమ్ ప్లాన్ కూడా వున్నట్లే వుంది.. అన్నీ వున్నా, బిగ్‌బాస్‌లో ‘లక్కు’ కూడా కలిసి రావాలి.