బిగ్‌బాస్ హౌస్ నుంచి ర్యాపర్ నోయెల్ సీన్ ఔట్ (Noel Sean Walked Out From Bigg Boss) అయ్యాడు. అనారోగ్య సమస్యలతో నోయెల్ సీన్, బిగ్ హౌస్‌ని వీడాల్సి వచ్చింది. నిజానికి, బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ డే వన్ నుంచీ నోయెల్ సీన్, హౌస్‌లో ఇబ్బందికరంగానే కొనసాగుతున్నాడు.
‘నా హెల్త్ ఇష్యూస్ మీకు తెలుసు కదా బ్రో..’ అంటూ పలు సందర్భాల్లో నోయెల్, తోటి కంటెస్టెంట్లతో చెబుతూ వస్తున్నాడు. అయితే, ‘నోయెల్ సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తున్నాడు.. అభిమానుల్ని ఎమోషనల్‌గా తనవైపుకు తిప్పుకుంటున్నాడు..’ అంటూ నోయెల్ (Noel Sean) మీద ఆరోపణలు వచ్చాయి.
అయితే, నోయెల్ అనారోగ్య సమస్య పట్ల మొదటి నుంచీ అబిజీత్ (Abijeet) చింతిస్తూనే వున్నాడు. ఓ వీలైనప్పుడల్లా నోయెల్‌కి సాయం చేస్తూనే వున్నాడు అబిజీత్. ఇటీవలి ఎపిసోడ్స్‌లో, ‘జాగ్రత్త బ్రో.. నీకు తలెత్తిన అనారోగ్య సమస్య కారణంగా అది పర్మనెంట్ ఇష్యూ అవకూడదు..’ అని నోయెల్‌కి అబిజీత్ సూచించాడు కూడా.
డాక్టర్స్ అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి, త్వరగానే రికవర్ అవుతాననే ఆత్మవిశ్వాసాన్ని నోయెల్ ప్రదర్శించాడుగానీ, అనారోగ్య సమస్య కాస్త తీవ్రమైనదిగానే డాక్టర్లూ తేల్చినట్లు కనిపిస్తోంది.
స్పెషలిస్ట్ డాక్టర్ల సూచన మేరకు ప్రత్యేక వైద్యం అవసరం గనుక, హౌస్ (Bigg Boss Telugu 4) నుంచి ఇంటికి పంపించాల్సి వస్తోందంటూ బిగ్‌బాస్ (Bigg Boss 4 Telugu) తేల్చి చెప్పేశాడు. సో, నోయెల్ సీన్ ఈ సీజన్ నుంచి ఔట్ అయిపోతున్నాడన్నమాట.
అనారోగ్య సమస్యలతో కొద్ది వారాల క్రితం గంగవ్వ కూడా ఇలాగే హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం విదితమే. అనారోగ్య సమస్య అనడం కన్నా, మానసిక అనారోగ్య సమస్య అనడం కరెక్టేమో గంగవ్వకు సంబంధించి.
అన్నట్టు, హౌస్‌లో మరికొందరికి కూడా హెల్త్ ఇష్యూస్ (Noel Sean Walked Out From Bigg Boss) వున్నాయి. అబిజీత్, అవినాష్ (Avinash) కూడా ఇబ్బందులు పడుతున్నారు. మోనాల్ గజ్జర్ (Monal Gajjar)కూడా పదే పదే అస్వస్థతకు గురవుతోంది.
గత సీజన్లలో అంతగా కనిపించని ఈ సమస్య ఈసారి చాలా ఎక్కువగా కనిపిస్తుండడం బిగ్‌బాస్ వ్యూయర్స్‌నీ ఆందోళనకు గురిచేస్తోంది.