రహస్య గదిలోంచి బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌తో పంచాయితీ పెట్టుకున్నారు అరియానా గ్లోరీ, సోహెల్. (Noel Sean Syed Sohel Bigg Boss Telugu 4)అది వారికి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ అనుకున్నా.. ఆ తర్వాత కూడా అదే టెంపో మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు సోహెల్.
మరీ ముఖ్యంగా సోహెల్‌కి, నోయెల్ అంటే అస్సలు పడటంలేదు. నోయెల్ ఒక్కడితోనే కాదు, అబిజీత్‌తో కూడా సోహెల్ గొడవ ఇప్పటికే పెట్టేసుకున్నాడు. అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్స్ చేస్తూ చాలా నెగెటివిటీని మూటగట్టుకుంటున్నాడు సోహెల్. అయితే, ఇదంతా టాస్క్‌లో భాగమేనా.? అంటే, ‘టాస్క్ అయిపోయింది’ అని ఇప్పటికే చెప్పేశాడాయె.
‘కట్టప్ప ఎవరు.?’ అనే అంశం చుట్టూ జరిగిన స్టాంపింగుల సందర్భంలో నోయెల్‌తో ఆర్గ్యుమెంట్‌కి దిగాడు సోహెల్. అంతకు ముందు కూడా ఇద్దరి మధ్యా ‘సఖ్యత’ లేకపోవడంతో చిన్న విషయమే వివాదంగా మారింది. అయితే, తాను కాకుండా ఎవరో ఒకరికి స్టాంప్ వేయాల్సి వుండగా, నోయెల్ అందుకు సుముఖత వ్యక్తం చేయకుండా తనకు తానే కట్టప్పనని ప్రకటించుకుని స్టాంపేసుకోవడం హౌస్‌లో ఎవరికీ నచ్చలేదు.
బిగ్ బాస్ కూడా అభ్యంతరం చెప్పడంతో చేసేది లేక రాజశేఖర్‌కి స్టాంప్ వేశాడు. ఈ క్రమంలో ‘మీ ఇంట్లోవాళ్ళు ఫీలవుతారు కదా.. అందుకే మీలో ఎవరికీ స్టాంప్ వేసే ఉద్దేశ్యం లేదు. అందుకే నాకు నేను స్టాంప్ వేసుకుంటున్నా..’ అని నోయెల్ చెప్పిన లాజిక్ అస్సలేమీ బాగాలేదు.
అయితే, సింపతీ కోసం నోయెల్ ఇదంతా చేస్తన్నాడని సోహెల్ అనడంతో మాటల యుద్ధం జరిగింది. అయితే, హౌస్‌లో అందర్నీ నోయెల్ తన వైపుకు తిప్పుకుంటున్నాడంటూ సోహెల్ అక్కసు వెల్లగక్కుతుండడంతోనే ఇద్దరి మధ్యా హాట్ హాట్ వాతావరణం నెలకొంది. నోయెల్‌ని టార్గెట్ చేయడం ద్వారా సోహెల్ ఏం సాధిస్తాడోగానీ, ఈ క్రమంలో సోహెల్ తన ఇమేజ్‌ని పాడుచేసుకుంటున్నాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
(24 గంటల్లో జరిగే విషయాల్ని, కేవలం గంటలో చూపించేస్తున్నారు గనుక.. వీళ్ళదే తప్పు, వీళ్ళది రైట్.. అని మనం జడ్జ్ చేసెయ్యలేం.)
