Table of Contents
NTR 30: 2024 ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదలవుతుందట.! ఇంతకీ, సినిమా టైటిల్ ఏంటి.? హీరోయిన్ ఎవరు.? ప్చ్.! అవైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
యంగ్ టైగర్ ఎన్టీయార్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం..
వచ్చే నెల.. అంటే, ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. నిజానికి, ఎప్పుడో.. చాలా రోజుల క్రితమే.. కాదు కాదు, చాలా నెలల క్రితమే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళి వుండాల్సింది.
కానీ, అనివార్య కారణాల వల్ల సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం ఆలస్యమవుతూ వచ్చింది.
‘ఆచార్య’ సినిమా దెబ్బతో కొరటాల శివ తన తదుపరి సినిమా కోసం సమయం తీసుకున్నాడా.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పెరిగిన ఎన్టీయార్ ఇమేజ్‌ని మ్యాచ్ చేయడానికి ఈ ఆలస్యం జరిగిందా.?
కారణాలేవైతేనేం.. కాస్త ఆలస్యంగా సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. ‘ఆలస్యమైనాగానీ, మంచి సినిమా ఇవ్వబోతున్నాం అభిమానులకి..’ అంటూ కళ్యాణ్ రామ్ కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
NTR 30 ఇంతకీ హీరోయిన్ ఎవరు.?
రష్మికని ఫైనల్ చేశారట.. పూజా హెగ్దేనే మరోమారు ఎన్టీయార్‌తో జత కట్టబోతోందట.. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వుందట.. ఇలా చాలా పుకార్లు వినిపిస్తున్నాయ్.
అన్నట్టు, జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్.. అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటున్నారుగానీ, హీరోయిన్ ఎవరన్నది తేల్చలేదు.
రిలీజ్ డేట్ వచ్చేసిందే..
అన్నట్టు, సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే రిలీజ్ డేట్ ఏంటబ్బా.?
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
కొరటాల సినిమాలు వేగంగానే రూపొందుతాయ్. కానీ, రోజులు మారాయ్. అనూహ్యంగా సినిమాల విడుదల తేదీలు చివరి నిమిషంలో మారిపోతుంటాయ్.
మరి, ఎలా ఏప్రిల్ 5, 2024లో సినిమా రిలీజ్ చేసేస్తామని అప్పుడే ప్రకటించేశారబ్బా.?