Nupur Sanon Tiger Tollywood.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, తన సోదరి నుపుర్ సనన్‌ని తెలుగు సినీ పరిశ్రమకి అప్పగించింది.!
ఔను, కృతి సనన్ గతంలో తెలుగు సినిమాల్లో నటించింది. ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్, ఆ తర్వాత ‘దోచెయ్’ సినిమాలోనూ నటించింది.
మొన్నీమధ్యనే, ‘ఆదిపురుష్’ (Prahas Adipush) సినిమాతోనూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కృతి సనన్ (Kriti Sanon).
Nupur Sanon Tiger Tollywood.. ఈసారి చెల్లెలి వంతు..
తాజాగా, కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతోంది. అదీ, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో.
రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమా ద్వారా నుపుర్ సనన్, తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది కృతి సనన్.
‘నా చెల్లెల్ని తెలుగు సినీ పరిశ్రమకు (Telugu Cinema) అప్పగిస్తున్నా..’ అంటూ కృతి సనన్ (Kriti Sanon) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్లు.. వాళ్ళ చెల్లెళ్ళు..
ఆర్తి అగర్వాల్ – అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్ – నిషా అగర్వాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దదే.
అన్నట్టు, ‘చిరుత’ ఫేం నేహా శర్మ కూడా తన సోదరి ఐషా శర్మని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసే ఆలోచనలో వుందిట.

కానీ, అక్కలు సక్సెస్ అయినట్లు చెల్లెళ్ళు తెలుగునాట సక్సెస్ అయ్యింది తక్కువే.! మరి, అక్క ఫెయిలయ్యింది కదా.. చెల్లెలు సక్సెస్ అవుతుందా.? అవుతుందేమో.!
Also Read : మెగా క్లిక్.! ఒక్క ఫొటో.. అన్ని ప్రశ్నలకీ సమాధానం.!
పై ఫొటోని, ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) టీమ్ రివీల్ చేసింది. ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది కృతి సనన్.!
తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేగానీ, నటనకు నుపుర్ సనన్ కొత్తేమీ కాదు. గతంలో ఒకటీ అరా బాలీవుడ్ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తన తొలి తెలుగు సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటానని ఈ బ్యూటీ చెబుతోంది.