Table of Contents
OG Statement Jai Chiranjeeva.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అసెంబ్లీ సాక్షిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, సినీ నటుడు అలానే హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణది అసందర్భ ప్రేలాపన.
గత ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు తలెత్తిన ఇబ్బందులు, ఈ క్రమంలో చిరంజీవి పోషించిన పెద్దన్న పాత్ర గురించిన ప్రస్తావన వచ్చింది మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాటల్లో.
OG Statement Jai Chiranjeeva.. బాలకృష్ణ ఎందుకు ఉలిక్కిపడినట్లు.?
సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా, సమస్య పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. ‘పెద్దన్న’ పాత్ర.. విషయమై ఎవరేమనుకున్నా, చిరంజీవి అది తన బాధ్యత అనుకుంటారు.
చిరంజీవి అలా పెద్దన్న పాత్ర పోషించడం వల్లే, కష్ట కాలంలోనూ సినీ పరిశ్రమ నిలదొక్కుకుంది. మొన్నటికి మొన్న సినీ కార్మికుల సమస్య వస్తే, అక్కడా చిరంజీవే పెద్దన్న పాత్ర పోషించారు.

దీన్ని, నందమూరి బాలకృష్ణ సహా సినీ పరిశ్రమలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నమాట వాస్తవం. పోనీ,
బాలకృష్ణ సహా ఆ కొందరు, ఏమైనా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతారా.? అంటే, అదీ లేదాయె.
చిరంజీవి లేఖ.. ఓజీ స్టేట్మెంట్..
మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. ఆ ప్రెస్ నోట్ చుట్టూ మళ్ళీ రచ్చ జరుగుతూనే వుంది. నిజానికి, బాలకృష్ణని చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తారు చిరంజీవి.
సో, చిరంజీవి నుంచి ఆ ప్రెస్ నోట్ వచ్చిందంటే, చాలామంది నమ్మడంలేదు. ఇదే విషయమై తాజాగా విదేశాల నుంచి వచ్చిన చిరంజీవిని మీడియా ప్రశ్నిస్తే, జస్ట్ నవ్వి ఊరుకున్నారంతే.

ఇంకోపక్క, ‘ఓజీ’ సినిమాని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సహా మెగా కుటుంబమంతా చూసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ఓజీ’ సినిమాని చూసినవారిలో వున్నారు.
నిజానికి, ఇదొక స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ – చిరంజీవి మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ అను‘కుల’ మీడియా, టీడీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రయత్నాలకు ఇది ముగింపు.
మెగా పవర్ అనుబంధం.!
తండ్రి లాంటి అన్నయ్య, తనయుడి లాంటి తమ్ముడు.. ఇదీ చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య వున్న అనుబంధం.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నా, టీడీపీతో జనసేన పార్టీ పొత్తులో వున్నా.. ఆ టీడీపీలో కొందరు చిరంజీవిని తూలనాడుతున్నా.. మెగా స్టేట్మెంట్ క్రిస్టల్ క్లియర్.!
Also Read: Pawan Kalyan OG Review: పవర్ తుఫాన్.!
బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, హైద్రాబాద్ ప్రత్యేకంగా వచ్చి మరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఇదీ.. The OG, Mega Statement..!
