One Day Wonder Jagan.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రైతులకు భరోసా ఇచ్చారట.! అది ఎలాంటి భరోసా.? అన్నది మాత్రం, వైసీపీ నేతలకే తెలియదు.!
ఇటీవల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుపాను వణికించింది. పంట నష్టం జరిగింది. ఈ క్రమంలో రైతుల్ని పరామర్శించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
తుపాను ఎప్పుడు వచ్చింది.? అప్పుడాయన ఎక్కడ వున్నారు.? తుపాను వచ్చి వెళ్ళాక, ఎన్ని రోజులకు వైఎస్ జగన్, బాధిత రైతుల్ని పరామర్శించారు.? వీటిపై ప్రజలకు ఓ అవగాహన వుంది.
సరే, రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం చేయాలి. వైసీపీ చేస్తున్నదదే.! రైతులకు వైఎస్ జగన్ నిజంగానే భరోసా ఇచ్చి వుంటే మంచిదే.
ప్రభుత్వం ఎంతలా రైతుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చినా, అది సరిపోదు. ప్రభుత్వానికి కొన్ని పరిమితులుంటాయి. రాజకీయ పార్టీల విషయంలోనూ అంతే.
One Day Wonder Jagan.. రైతులకి వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా ఏంటి.?
ఇంతకీ, పంట నష్టం జరిగిన రైతులకు వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా ఏంటి.? ఆర్థిక సాయం ఏమైనా ప్రకటించారా పార్టీ తరఫున.? ప్చ్.. లేదాయె.! రాజకీయ విమర్శలతో సరిపెట్టారు.
బెంగళూరు నుంచి వచ్చారు, పంట చేలల్లో దిగారు. ‘మహర్షి అనీ, మహా రుషి అనీ.. రైతు బిడ్డ అనీ..’ వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకోడానికే ఉపయోగపడింది మొత్తం వ్యవహారం.
వేలాది మంది జనాన్ని వైసీపీ పోగేసింది. ఒక్కొక్కరికీ వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చి మరీ, బల ప్రదర్శనకు దిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమ అధినేత పర్యటన నిమిత్తం.
బల ప్రదర్శన కాకుండా, ఆ బల ప్రదర్శన కోసం చేసిన ఖర్చు తాలూకు మొత్తాన్ని, సింపుల్గా జగన్ రైతుల్ని పరామర్శించి అందించి వుంటే, వచ్చే మైలేజ్ వేరే లెవల్ కదా.?
Also Read: ‘బాహుబలి ది ఎపిక్’ సమీక్ష: జస్ట్ రీ-రిలీజ్ అంతే.!
ఇదే చర్చ, బాధిత రైతుల్లో కనిపిస్తోంది. జగన్ పర్యటన సందర్భంగా, వైసీపీ శ్రేణులు పంట పొలాల్ని పచ్చడి పచ్చడి చేసేశాయి. వైసీపీ సొంత మీడియా సిబ్బంది కూడా, నిర్దయగా.. పంట పొలాల్ని పాడు చేశారు.
అప్పుడప్పుడూ, రాష్ట్రానికి వచ్చి పోతున్న వైఎస్ జగన్, నేడో రేపో తిరిగి బెంగళూరుకు పోతారు. తుపాను నష్టానికి అదనంగా, జగన్ పర్యటన, తద్వారా జరిగిన పంట నష్టం చూసి, రైతులు కుదేలవ్వాలంతే.
జగన్ పొలిటికల్ టూర్స్ పద్ధతి మారదు. ఆయన రాజకీయం మారదు.! ఇదింతే..!
