Operation Sindoor Pawankalyan Warning.. దేశానికి, దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారమిది.!
సోషల్ మీడియా వేదికగా ఇన్‌ఫ్లూయెన్సర్స్ ముసుగులో దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు.!
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరిక ఇది.! ఓ వైపు, తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి భారత భద్రతా బలగాలు తమదైన స్టయిల్లో సమాధానమిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకో వైపు, దేశంలో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు, మేధావుల ముసుగులో ఇంకొందరు.. పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ వామపక్ష నేత అయితే, యుద్ధానికి ‘మా పార్టీ వ్యతిరేకం’ అంటున్నాడు.
Operation Sindoor Pawankalyan Warning.. చికెన్ ఫెలోకి కూడా గట్టిగానే..
సదరు ‘చికెన్ ఫెలో’, సైన్యం వున్నది తీవ్రవాదుల్ని ఏరివేయడానికేగానీ, యుద్ధం చేయడానికి కాదంటూ.. పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు.
ఈ నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వ్యాఖ్యలు కావవి, హెచ్చరికలు.!
కొందరు నెటిజన్లు అయితే, తమ స్థాయిని దిగజార్చుకుని మరీ, శతృదేశం పాకిస్తాన్‌కి మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.

‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ పట్ల స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో, కొన్ని కుక్కలు అరిచాయి.
ఆ అరుపుల్ని ప్రస్తావిస్తూ, సోకాల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్లను కుక్కలతో పోల్చారు పవన్ కళ్యాణ్. దేశం మీద మొరిగే కుక్కల్లాంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌ని వదిలిపెట్టేదే లేదని, లోపలేస్తామని హెచ్చరించారాయన.
చివరి ఉగ్రవాదిని ఏరివేసేదాకా ఆపరేషన్ సిందూర్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చివరి తీవ్రవాదిని ఏరిపారేసేదాకా ఆపరేషన్ సిందూర్ కొనసాగాలని ఆకాంక్షించారు.
ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Also Read: Shubman Gill.. ‘గిల్లే’శాడు.. చాలా గట్టిగా.!
క్లిష్ట సమయంలో ప్రతి పౌరుడూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న పవన్ కళ్యాణ్, సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దని సూచించారు.
భారత సైన్యాన్ని కించపరిచినా, దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.