Table of Contents
Pan India Cinema పాన్ ఇండియా హీరో.! పాన్ ఇండియా సినిమా.! అసలేంటి ఈ కొత్త కథ.?
‘బాహుబలి’ని పాన్ ఇండియా సినిమా అన్నాం. తెలుగు సినిమా సత్తాని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన దర్శకుడిగా రాజమౌళి గురించి చెప్పుకుంటున్నాం.
నో డౌట్.! రాజమౌళి ది గ్రేట్ ఫిలిం మేకర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రాజమౌళి కంటే ముందే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేసిన దర్శకులు చాలామందే వున్నారు.
పాన్ ఇండియా కాదు.. ఇండియన్ సినిమా.!
మణిరత్నం (Maniratnam) ఎవరు.? శంకర్ (Director Shankar) ఎవరు.? చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే. మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా కొదరు జాతీయ స్థాయి సినిమాలు తెరకెక్కించారు.
కమల్ హాసన్ (Kamal Haasan) జాతీయ స్థాయి నటుడు. రజనీకాంత్‌కి (Rajnikanth) జాతీయ స్థాయిలో నటుడిగా వున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిరంజీవి (Mega Star Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Akkineni Nagarjuna) కూడా హిందీ సినిమాలు చేశారు.
హీరో సిద్దార్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించాడు, స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు.
ఇదేం పైత్యం.?
ఓ ‘బాహుబలి’, ఓ ‘ఆర్ఆర్ఆర్’, ఓ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’, ఓ ‘పుష్ప’.. ఇలా కొన్నిటి పేర్లు చెప్పుకుని, ఆయా భాషల సినిమాల పరువు తీసేస్తామా.? సౌత్ సినిమా పరువునీ అలాగే, ఇండియన్ సినిమా పరువునీ తీసేసుకుంటామా.?

ఇండియాలో తెరకెక్కే ప్రతి సినిమా ఇండియన్ సినిమానే. కొన్నిటి సక్సెస్ రేంజ్ ఎక్కువ.. కొన్ని సినిమాల రేంజ్ తక్కువ. అంతే తేడా.!
రాజమౌళిని మోసెయ్యడానికో, ప్రభాస్ ఇమేజ్ పెంచెయ్యడానికో, ఇండియన్ బాక్సాఫీస్ సీఈవో అంటూ యష్‌ని సరికొత్తగా పిలుచుకునేందుకో ‘పాన్ ఇండియా’ అస్త్రాన్ని ప్రయోగిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఇకపై Pan India Cinema అనకపోవడమే గౌరవం.!
ఇక్కడితో ఇంక చాలు.! ఇకపై పాన్ ఇండియా సినిమా అని ఎవరన్నా అంటే, అది మొత్తంగా ఇండియన్ సినిమాని అవమానపర్చినట్లే.
వివిధ సినీ పరిశ్రమల నుంచి నటీనటుల్ని తీసుకుని, సినిమాలు నిర్మిస్తూ.. ప్రాంతీయ, పాన్ ఇండియా సినిమాలనడం సిగ్గు చేటన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎప్పుడూ వివాదాల్లో వుండటానికి ఇష్టపడే నటుడు సిద్దార్థ, పాన్ ఇండియా.. అంటోంటే హాస్యాస్పదంగా వుందని చెప్పాడు తాజాగా.
Also Read: ఏంటి దేవీ మరీనూ.! విశ్వక్ సేనుడి ‘రగడ’తో ఏం సాధించినవ్.!
దాంతో, పాన్ ఇండియా అంశంపై ఇంకోసారి లోతైన చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా అంటే పాపమెలా అవుతుంది.? ఈ వివాదంతో సిద్దార్థ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడా.? అన్న అనుమానాలైతే చాలామందికి కలుగుతున్నాయి.
ఒక్కటి మాత్రం నిజం.. పాన్ ఇండియా అనే మాట కొత్తదేమోగానీ.. ఆయా భాషల్లో సినిమాలు సరిహద్దులు దాటి ఇండియన్ సినిమాలుగా.. అంతర్జాతీయ సినిమాలుగా సత్తా చాటిన సందర్భాలు గతంలోనూ వున్నాయి.
– yeSBee